RATHA SAPTHAMI GRANDUER AT SRI PAT_ సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

Tirupati,24 January 2018: Devotees in large number made a bee line to holy srhines as part of the Ratha saptami festival both Lord Venkateswara and Sri Padmavati Ammavaru rode on seven vahanas and festivities at all local temples of TTD touhed new heights.

Devotees were thrilled at Padmavati Ammavari temple, seven vahana sevas were conducted. The 12 bhajan teams of HDPP and Dasa Sahitya Project and SV Sangeet and Dance college performed Kolatas, Chakka bhajans and Chidathala bhajans on the ocassion at many of the local TTD temples.

Among Spl Gr DyEO Sri Muniratnam Reddy, AEO Sri Subramanyam, AVSO Sri Parthasarathy Reddy and CI Sri Bhaskar, Arjita Inspector Sri Guravayya participated in the day events.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

టిటిడి స్థానికాలయాల్లో బ్రహ్మోత్సవాలను తలపించిన రథసప్తమి వేడుకలు

విశేష సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

తిరుపతి, 2018 జనవరి 24: సూర్యజయంతిని పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన శ్రీవారి నుదుట, నాభి, పాదాలపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారు ఏడు వాహనాలపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉదయం 7.00 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2.00 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో 12 భజన బృందాలు పాల్గొన్నాయి. కోలాటాలు, చెక్కభజనలు, చిడతల భజన తదితర ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీసుబ్రమణ్యం, ఎవిఎస్‌వో శ్రీ పార్థసారధిరెడ్డి, సిఐ శ్రీ భాస్కర్‌, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ గురవయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.