REACHING SRIVARI LADDUS IN DEVOTEES _ భక్తులకు అందుబాటులో శ్రీవారి లడ్డూలు

Nellore, August 17, 2022: TTD has kept an adequate stock of Srivari laddus at the AC Subba Reddy stadium for the benefit of the scores of devotees attending the ongoing Sri Venkateswara Vaibhavotsavam in Sri Potti Sriramulu, Nellore District, which commenced on August 16 and concludes on August 20.

TTD has set up separate laddu stalls and has been selling delicious Srivari laddus at Rs 50 each to the local devotees who are thronging the spacious AC Subba Reddy Stadium.

On the other hand, the VPR foundation is also distributing small laddus as Srivari Prasadam to all devotees taking part in this religious festival.

TTD also made elaborate arrangements for the distribution of Annaprasadams of Pulihora, Chakkarapongal, Katte Pongal, and Dadhyodanam, etc, along with the supply of drinking water and temporary toilets for the sake of local devotees at the stadium premises.

ISSUED BY TTD’s PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భక్తులకు అందుబాటులో శ్రీవారి లడ్డూలు

నెల్లూరు, 2022, ఆగస్టు 17 ;నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూలను టిటిడి అందుబాటులో ఉంచింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. తిరుమల తరహాలోనే ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున భక్తులకు అందిస్తున్నారు. నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు.

అదేవిధంగా, విపిఆర్ ఫౌండేషన్ తరఫున భక్తులందరికీ చిన్న లడ్డూలను స్వామివారి ప్రసాదంగా అందిస్తున్నారు.

స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తులందరికీ పులిహోర, బెల్లం పొంగళి, కట్టె పొంగళి, దధ్యోదనం ప్రసాదంగా అందిస్తున్నారు.

పలు ప్రాంతాల్లో భక్తుల కోసం తాగునీరు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా భక్తులకోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.