RECORD 6.47 LAKH DEVOTEES HAD VAIKUNTADWARA DARSHAN- EO TTD _ 6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం- మీడియా స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

COMFORTABLE DARSHAN TO ALL DEVOTEES

Tirumala,02 January 2024: TTD EO Sri AV Dharma Reddy on Tuesday said that a record number of 6.47 lakh devotees were provided Vaikuntadwara Darshan between December 23 and January 1.

Addressing a media conference at Annamaiah Bhavan in Tirumala he said devotees were provided with comfortable and hassle-free Srivari Darshan through time Slotted tokens to avoid prolonged wait in queue lines and more number of devotees than usual had Anna Prasadam during the period.

He said during ten days as many as 19,255 VIP break protocol tickets were issued but only 18,578 attended and 677 (3.3 % ) were absent. Similarly, 6858 tickets were booked online by donors of which 6388 were present and 470(7%)  were absent.

The Srivani Trust donors were issued 20,000 tickets of which 917 (4.5%) did not come. A total of 2.25 lakh 300 Special Entry Darshan tickets were issued online of which 1,97,254 availed with 27,476 (12.2%) absentees. Nearly 4,23,500 time slot Sarva Darshan tokens were issued of which 3,24,102 utilized darshan and 90,850 (21.5%) did not come.

In the same way, TTD Hundi collection recorded 40.20 crores, 17.81 Anna Prasadam, 35.60 lakh laddus sold and 2.14 lakh devotees tonsured hairs.

Responding to a media query EO said there was no response from the Archeological Survey of India for several letters with regard to repairing the dilapidated stone Padala Mandapam at Alipiri.

Similarly, there was no response to letters about wall collapse of Sri Soumyanath Swamy temple at Nandalur. TTD has set up a division with experts and Sthapathis for rejuvenation of dilapidated Mandapams and temples. The SV Traditional Sculpture Institute of TTD has produced sculptors to make and rebuild temples. They had built wonderful temples at Jammu, Visakhapatnam, Hyderabad, Odisha, Kanyakumari, Seethampeta and Rampachodavaram regions.

He said devotees on the Alipiri footpath are regularly alerted on the movements of leopards and other wild animals after tracking them on trap cameras installed in the region. Further action was initiated to buy more trap cameras.

Srivari temple DyEO Sri Lokanatham, VGO Sri Nanda Kishore and catering OSD Sri GLN Shastri were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

– సంతృప్తిక‌రంగా ద‌ర్శించుకున్న భ‌క్తులు

– మీడియా స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 02 జనవరి 2024: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 ల‌క్ష‌ల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం క‌ల్పించామ‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వారికి నిర్దేశించిన స‌మ‌యంలోనే సంతృప్తిక‌రంగా స్వామివారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించామ‌న్నారు. ద‌ర్శించుకున్న భ‌క్తుల‌తోపాటు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య గ‌తం కంటే పెరిగింద‌ని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేశామ‌న్నారు. 10 రోజుల‌కు క‌లిపి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామ‌ని, 18,578 మంది హాజ‌రుకాగా, 677 మంది(3.3 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. దాత‌ల‌కు బ్రేక్ ద‌ర్శ‌నానికి సంబంధించి ఆన్‌లైన్‌లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నార‌ని, 6,388 మంది హాజ‌రుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని వివ‌రించారు.

శ్రీ‌వాణి దాత‌ల‌కు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామ‌ని, 19,083 మంది హాజ‌రుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలియ‌జేశారు. రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 2.25 ల‌క్ష‌ల టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నార‌ని, 1,97,524 మంది హాజ‌రుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 ల‌క్ష‌లు మంజూరు చేశామ‌ని, 3,24,102 మంది హాజ‌రుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని వెల్ల‌డించారు.

అదేవిధంగా, ఈ ప‌ది రోజుల‌కు క‌లిపి రూ.40.20 కోట్లు హుండీ కానుక‌లు అందాయ‌ని, 17.81 ల‌క్ష‌ల మంది అన్న‌ప్ర‌సాదాలు, 35.60 ల‌క్ష‌ల మంది ల‌డ్డూ ప్ర‌సాదాలు స్వీక‌రించార‌ని, 2.14 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని ఈవో తెలియ‌జేశారు.

మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ఈవో స‌మాధాన‌మిస్తూ అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌గ‌ల రాతిమండ‌పం కూలిపోయే స్థితికి చేరుకుంద‌ని, దీని పున‌ర్నిర్మాణానికి సంబంధించి భార‌త పురావ‌స్తు శాఖకు ప‌లుమార్లు లేఖ‌లు రాసినా స్పంద‌న లేద‌ని తెలిపారు. నంద‌లూరులోని శ్రీ సౌమ్య‌నాథ‌స్వామివారి ఆల‌య గోడ కూలింద‌ని, దీనికి సంబంధించి పురావ‌స్తు శాఖ‌కు లేఖ‌లు రాసినా స్పందించ‌డం లేద‌ని చెప్పారు. రాతిమండ‌పాలు, ఆల‌యాల పున‌ర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్ర‌త్యేకంగా ఆల‌య నిర్మాణ విభాగం ఉంద‌ని, ఇక్క‌డ నిపుణులైన స్థ‌ప‌తులు ఉన్నార‌ని వివ‌రించారు. ఎస్వీ శిల్ప క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో ఎంతో మంది నిపుణుల‌ను త‌యార‌వుతున్నార‌ని, వీరు విగ్ర‌హాల త‌యారీతోపాటు, చ‌క్క‌గా ఆల‌యాలు నిర్మించ‌గ‌ల‌ర‌ని తెలియ‌జేశారు. ఇటీవ‌ల జ‌మ్మూకాశ్మీర్‌, వైజాగ్‌, హైద‌రాబాద్‌, ఒడిశా, క‌న్యాకుమారి, సీతంపేట‌, రంప‌చోడ‌వ‌రం ప్రాంతాల్లో అత్యంత సుంద‌రంగా రాతి క‌ట్ట‌డంతో ఆల‌యాలు నిర్మించామ‌ని వెల్ల‌డించారు.

అలిపిరి న‌డ‌క‌మార్గంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత‌, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన‌పుడు వెంట‌నే భ‌క్తుల‌ను అప్ర‌మ‌త్తం చేసి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర అట‌వీశాఖకు రూ.3.5 కోట్లు అందించామ‌ని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇత‌ర చ‌ర్య‌లు చేప‌డ‌తార‌ని చెప్పారు.

మీడియా స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, విజివో శ్రీ నంద‌కిషోర్, క్యాట‌రింగ్ ప్ర‌త్యేకాధికారి శ్రీ శాస్త్రి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.