RELAUNCH OF AKHANDA HARINAMA SANKEERTANA PROGRAM IN TIRUMALA FROM AUGUST 1 _ ఆగ‌స్టు 1 నుండి అఖండ హ‌రినామ సంకీర్త‌న పునఃప్రారంభం

Tirumala, 29 July 2022: As part of its Hindu Sanatana Dharma promotion activity, TTD is all set to relaunch the Akhanda Harinama Sankeertana from  August 1 in Tirumala.

The program in which folk artists from several regions come to Tirumala and perform sankeertans of Annamaiah, Ramadas, Thyagaraja and other stalwarts in their own style in a platform adjacent to the main Kalyana Katta. But it was stopped during the covid season for over two years.

TTD provides the artists accommodation, boarding and Srivari darshan and transport cost is directly credited to their bank accounts.

To facilitate the program TTD allotted time and day slots to the bhajan teams and details are uploaded on the TTD website-www.tirumala.org

As the activity is set to resume from August 1 onwards, TTD had uploaded the allocations of time and day slots for the month of August on its website already. The folk bhajan teams are provided an opportunity not only at Tirumala but also in festivities of all TTD temples in the districts across the State as well.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 1 నుండి అఖండ హ‌రినామ సంకీర్త‌న పునఃప్రారంభం

తిరుమ‌ల‌, 29 జులై 2022: తిరుమ‌ల‌లో అఖండ హ‌రినామ సంకీర్త‌న ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుండి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట వ‌ద్ద‌గ‌ల మండ‌పంలో సోమ‌వారం ఉద‌యం పూజా కార్య‌క్ర‌మంతో ఈ కార్య‌క్ర‌మం మొద‌లుకానుంది. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జాన‌ప‌ద క‌ళ‌ల‌ను ప‌రిర‌క్షించి అవి అంత‌రించిపోకుండా కాపాడేందుకు టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులను తిరుమ‌ల‌కు ఆహ్వానించి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలాప‌న చేయిస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు వ‌స‌తి, భోజ‌నం, ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. రాను పోను బ‌స్సు ఛార్జీల‌కు అయ్యే రుసుమును వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తారు. భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు నిర్దేశిత స్లాట్ కేటాయించి వారి వివ‌రాల‌ను టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లో అందుబాటులో ఉంచుతారు. ఆగ‌స్టు నెల‌కు సంబంధించి కేటాయించిన స్లాట్ల వివ‌రాల‌ను ఇప్ప‌టికే వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. తిరుమ‌ల‌తోపాటు వివిధ జిల్లాల్లోని టిటిడి ఆల‌యాల్లో జ‌రిగే ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.