RELEASE OF JULY 2026 DARSHAN QUOTAS _ జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు
Tirumala, 12 April 2026: TTD has announced the schedule for the release of various darshan and accommodation quotas for July 2026.
The details are as follows:
Arjitha Seva Tickets
The quota for Arjitha Sevas such as Suprabhatam, Thomala, Archana, and Ashtadala Pada Padmaradhana will be released online on April 18 at 10 AM.
Devotees can register for the electronic dip (e-dip) for these sevas until 10 AM on April 20.
Those who are allotted tickets through the dip must complete the payment between April 20 and April 22 before 12 noon, after which the tickets will be confirmed.
Release of Other Arjitha Seva Tickets – April 21
Tickets for Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva will be released online on April 21 at 10 AM.
Virtual Seva Quota
The quota for Virtual Sevas and their associated darshan slots will be released on the same day at 3 PM.
Angapradakshinam Tokens – April 23
Tokens for Angapradakshinam will be released online on April 23 at 10 AM.
Srivani Trust Darshan
The quota for Srivani Trust Darshan tickets will be released on April 23 at 11 AM.
Darshan for Senior Citizens and the Differently Abled
Free special darshan tokens for senior citizens, differently abled persons, and those with chronic illness will be released online on April 23 at 3 PM.
Special Entry Darshan – April 24
The quota for Special Entry Darshan (Rs.300 tickets) will be released online on April 24 at 10 AM.
Accommodation in Tirumala and Tirupati
The quota for accommodation (rooms) in Tirumala and Tirupati will be released online on April 24 at 3 PM.
Devotees are requested to book Arjitha Sevas, Darshan tickets, and accommodation only through the official TTD website: https://ttdevasthanams.ap.gov.in
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు
తిరుమల, 2026 ఏప్రిల్ 12: 2026 జూలై నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి దర్శన కోటా విడుదల
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
