Release of Wall Poster on PAVITHROTSAVAM in Sri Kodanda Rama Swamy Temple _ శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఈఓ
శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఈఓ
తిరుపతి, 2012 జూలై 10: ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగనున్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి పవిత్రోత్సవాల పోస్టర్లను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం సాయంత్రం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
కాగా పవిత్రోత్సవాలకు జూలై 13వ తేదీన అంకురార్పణ జరుగనుంది. జూలై 14వ తేదీన పవిత్ర ప్రతిష్ట, జూలై 15వ తేదీన పవిత్ర సమర్పణ, జూలై 16వ తేదీన పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ప్రపంచశాంతికి, దోషాల నివారణకు, అన్ని యజ్ఞములు చేసిన ఫలాన్ని పొందేందుకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం, ఒక పవిత్రంను బహుమానంగా అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.