RENDER SERVICE AND MAKE ANNUAL FETE A GRAND SUCCESS-JEO _ చక్కగా సేవ చేసి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయండి – శ్రీవారి సేవకులకు టీటీడీ జేఈవో శ్రీవీర బ్రహ్మం పిలుపు

TIRUPATI, 19 MARCH 2023: Offer dedicated services to the devotees participating in Vontimitta Brahmotsavams, especially in Sri Sita Rama Kalyanam and make the annual fete as huge hig, said TTD JEO Sri Veerabrahmam to Srivari Sevaks.

Addressing the sevaks who has come forward to offer services at Vontimitta during the annual fete, the JEO on Sunday said, on tge day of Sita Rama Kalyanam on April 5, the devotees start coming to galleries from 4pm itself. So you all should be prepared with bags containing Annaprasadam, Laddu, Akshata, Pasupu-Kumkuma packets, water sachets etc.

The passes related to service areas will be distributed and you all should render services to devotees with patience, he added. “Keep up the reputation of Srivari Seva live with your impeccable services during Vontimitta Brahmotsavams, he maintained.

CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, GM Transport Sri Sesha Reddy, PRO Dr T Ravi, SVETA Director Smt Prasanthi, VGO Sri Manohar were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చక్కగా సేవ చేసి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయండి
– శ్రీవారి సేవకులకు టీటీడీ జేఈవో శ్రీవీర బ్రహ్మం పిలుపు

తిరుపతి 19 మార్చి 2023: శ్రీవారి సేవకులు ఎప్పటిలాగే ఈ సారి కూడా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు,కళ్యాణోత్సవంలో భక్తులకు చక్కని సేవలు అందించాలని టీటీడీ జేఈవో శ్రీవీరబ్రహ్మం పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ఆదివారం ఒంటిమిట్టలో శ్రీవారి సేవకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 5వ తేదీ స్వామివారి కల్యాణం రోజున సాయంత్రం 4 గంటల నుండే భక్తులు గ్యాలరీల్లోకి వస్తారని అన్నారు .భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం,అక్షింతలు,పసుపు,కుంకుమ , వాటర్ పాకెట్లు ఉంచిన బ్యాగు అందిస్తామని చెప్పారు. శ్రీవారి సేవకులు గ్యాలరీల్లో ఉండి భక్తులందరికీ ఈ బ్యాగులు అందించాలని చెప్పారు. భక్తులతో మర్యాద పూర్వకంగా, ఓపికతో వ్యవహరించాలన్నారు. శ్రీవారి సేవకులు ఎక్కడ సేవ చేయాలో నిర్ణయించి అందుకు సంబంధించిన పాసులు ముందే ఇస్తామని జేఈవో చెప్పారు. సేవకోసం వచ్చే వారికి ఆహారం ఇతర సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. టీటీడీలో శ్రీవారి సేవ విభాగానికి ఎంతో గౌరవం గుర్తింపు ఉన్నాయన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అద్భుత సేవలందించి ఈ పేరు నిలుపుకోవాలని శ్రీవీరబ్రహ్మం కోరారు .

ఎస్వీబీసి సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వరరావు, పిఆర్వో డాక్టర్ రవి, జిఎం ట్రాన్స్ పోర్ట్ శ్రీ శేషారెడ్డి ,శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, విజివో శ్రీ మనోహర్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది