RENDER SERVICE TO PILGRIMS WITH PATIENCE _ ఓర్పు, సహనంతో భక్తులకు సేవలందించండి – విజలెన్స్ అధికారులు, సిబ్బందికి సివిఎస్వో పిలుపు
TIRUPATI, 01 NOVEMBER 2021: TTD Vigilance and Security sleuths should offer services to pilgrims with patience and dedication said CVSO Sri Gopinath Jatti.
On the last day of Vigilance Awareness Week addressing the occasion at SPRH Tirupati on Monday the CVSO complimented his team members for their impeccable services.
Later he felicitated 34 security personnel who showcased expertise in their respective tasks execution. He also gave send off to Sri Gangaraju who had completed his full term of deputation as AVSO for five years and for his memorable services at Alipiri, Vaikuntam, Tirumala temple and Sector 3 during his tenure.
VGOs Sri Bali Reddy, Sri Manohar and AVSOs were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఓర్పు, సహనంతో భక్తులకు సేవలందించండి – విజలెన్స్ అధికారులు, సిబ్బందికి సివిఎస్వో పిలుపు
తిరుపతి 1 నవంబరు 2021: విజిలెన్స్ అధికారులు, సిబ్బంది ఓర్పు, సహనంతో భక్తులకు సేవలందించాలని సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి పిలుపు నిచ్చారు.
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు సమావేశం సోమవారం రాత్రి పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, టీటీడీ లోని అన్ని ఆలయాలు, విద్యాసంస్థలు, అన్ని విభాగాల్లో అవగాహన వారోత్సవాలు చక్కగా నిర్వహించారని అధికారులు, సిబ్బందిని అభినందించారు. భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా పని చేయాలని చెప్పారు. నిఘా, భద్రత విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది సిబ్బందికి సివిఎస్వో బహుమతులు ప్రదానం చేశారు. సివిఎస్వో ను సిబ్బంది సన్మానించారు. అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి ని సివిఎస్వో సన్మానించారు.
టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఐదేళ్ళ పాటు పనిచేసి మాతృశాఖకు వెళుతున్న ఎవిఎస్వో శ్రీ గంగరాజు ను ఈ సందర్భంగా సివిఎస్వో, ఇతర అధికారులు, సిబ్బంది సన్మానించి వీడ్కోలు పలికారు.
విజివో లు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మనోహర్, ఎవిఎస్వో లు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది