REST SHELTERS FOR PEDESTRIAN PILGRIMS TO TIRUMALA _ నడచి వచ్చే భక్తుల కోసం విశ్రాంతి షెల్టర్ల నిర్మాణం
- KUMBHABHISHEKAM OF SRI PADMAVATHI TEMPLE AT CHENNAI WITHIN ONE YEAR- TTD CHAIRMAN
- SRI SEKHAR REDDY TAKES OATH AS LAC CHAIRMAN AT CHENNAI
Tirupati, 04 October 2021: TTD Chairman Sri YV Subba Reddy said TTD is contemplating to build rest shelters for every 20-30 kms to facilitate devotees coming from Tamilnadu on foot to Tirumala.
His announcement came during his participation as Chief Guest at the oath-taking ceremony of Sri Sekhar Reddy as Chairman of Local Advisory Committee of TTD at the TTD information centre in T.Nagar at Chennai on Monday.
Speaking on the occasion the TTD Chairman lauded Sri Sekhar Reddy as an ardent devotee of Sri Venkateswara and his contributions to the Hindu dharma propagation.
He said within a year before the commencement of the holy Peritasi pilgrimage of Tamil devotees who come on foot to Tirumala, resting shelters shall be built along the route for their benefit.
He said TTD is also mulling to conduct the Kumbhabhishekam of the Sri Padmavati temple which is under construction at Chennai within one year.
He said the Tamilnadu government has also agreed to give land in OMR, ECR regions towards the construction of Srivari temple at Chennai on the lines of Tirumala temple.
“The TTD engineers will scrutinise the lands at both locations and decide on a suitable plot for Srivari temple and Bhumi puja will be performed and temple construction activity will commence”, he said.
The TTD Chairman also said TTD is planning to build a Kalyana Mandapam in a two acre land at Royapettah for the benefit of lower middle class families.
Speaking on the occasion Sri Sekhar Reddy said with Srivari blessings he had taken up the construction of Go Mandir at Alipiri where Go Thulabharam, the first of its kind in the country is also set up.
Rajya Sabha MP Sri Vemireddy Prabhakar Reddy, TTD board member Sri Shankar were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPAT
నడచి వచ్చే భక్తుల కోసం విశ్రాంతి షెల్టర్ల నిర్మాణం
– ఏడాది లోపు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం
టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
స్థానిక సలహా.మండలి చైర్మన్ గా శ్రీ శేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తిరుపతి 4 అక్టోబర్ 20 21: చెన్నై నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్లు దూరానికి వసతి షెల్టర్లు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ
వై వి సుబ్బారెడ్డి చెప్పారు.
చెన్నై టీ నగర్ లోని టిటిడి సమాచార కేంద్రం లో స్థానిక సలహామండలి చైర్మన్ గా
శ్రీ శేఖర్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, శ్రీ శేఖర్ రెడ్డి తిరుమల శ్రీవారి పరమ భక్తుడు అని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ఆయన ఇతోధిక సహాయం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఏడాది పెరటాసి మాసం ప్రారంభమయ్యే లోపు కాలినడకన వచ్చే భక్తుల సదుపాయం కోసం షెల్టర్లు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. చెన్నై లో నిర్మిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు. తిరుమల తరహాలో చెన్నై నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓఎంఆర్, ఈసిఆర్ ప్రాంతాల్లో భూమి ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు టిటిడి ఇంజనీర్లు ఈ రెండు భూములను త్వరలో పరిశీలించి, స్వామివారి ఆలయ నిర్మాణానికి ఏ భూమి అనుకూలమో నిర్ణయిస్తారని చెప్పారు. అనంతరం త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. చెన్నై నగరంలోని రాయపేట లో ఉన్న రెండు ఎకరాల భూమిలో మధ్య, దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా టిటిడి కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు . ఈనెల 11వ తేదీన ఎస్ వి బి సి హిందీ, కన్నడ ఛానళ్ళను ముఖ్యమంత్రులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీ బసవ రాజ్ బొమ్మై ప్రారంభిస్తారన్నారు. అలిపిరి వద్ద శ్రీ శేఖర్ రెడ్డి నిర్మించిన గో మందిరాన్ని అదే రోజు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకే తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నామన్నారు.
స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అలిపిరిలో గోమందిరం నిర్మిస్తున్నామని చెప్పారు.ఇక్కడ గో తులాభారం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి వారు ఇది తనకు ఇచ్చిన భాగ్యమని ఆయన అన్నారు.
రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ శంకర్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది