Review Meet by E.O TTD in Adm Bldg _ కాలినడక యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు : తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా. కె.వి. రమణాచారి 

Tirupati, 26 March 2009: Facilities being provided to the pedestrian pilgrims have to be streamlined told Dr K.V.Ramanachary, Executive Officer, TTDs. On Thursday morning he has conducted the review meeting with the officials at TTD Adm Bldg, Tirupati.

While speaking with officials he has informed the necessary software may be prepared so as to cater for the needs of the pilgrims. He asked the Supdt Engineer, Tirumala to arrange necessary control rooms at Galigopuram, PAC-II and in VQC-II to operate token issue counters at an early date.

He has asked the EDP Manager and Reception Officials to arrange lockers, tonsuring and meals facility at PAC-II where nearly 2000 pilgrims can stay at a time. Separate compartments may be earmarked for the pilgrims at VQC-II he told special Officer, Tirumala. Later, he said that all these arrangements have to be completed at an early date.

TTD JEO Sri V.Seshadhri, C.V&S.O Sri PVS Ramakrishna, TTDs Spl Officer, Sri A.V.Dharma Reddy, DyE.O’s Sri Prabhakara Reddy, Sri Siddiah, Sri Umapathy, S.E’s Sri Ramesh Reddy, Sri Ramachandra Reddy, Sri Chandrasekhar Reddy, Addl C.V&S.O Sri Sivakumar Reddy, EDP Manager Sri Bhaskar, Vigilance Officials and others have participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కాలినడక యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు : తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా. కె.వి. రమణాచారి

 తిరుపతి  మార్చి-26,2009: తిరుపతి నుండి కాలినడక ద్వారా తిరుమలకు వెళ్ళు యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా. కె.వి. రమణాచారి అన్నారు. గురువారం ఉదయం తి.తి.దే. పరిపాలనా భవనంలో అధికారులతో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భముగా ఇ.ఓ. మాట్లాడుతూ తిరుపతి నుండి కాలినడక ద్వారా తిరుమలకు ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వెళుతుంటారని, వారికి అవసరమైన వసతి, తలనీలాలు తీసుకొనే సౌకర్యం, భోజనం, దర్శనముకు సంబంధించిన టిక్కెట్లను గాలిగోపురం వద్ద జారీచేసే విధానం భక్తులకు ప్రయోజనకారిగా ఉంటుందని అయన అన్నారు.

భక్తులకు ప్రయోజనంగా ఉండేందుకుగాను రెండవ యాత్రికుల వసతి సముదాయం వద్దే కౌంటరును ఏర్పాటు చేసి, గాలి గోపురం వద్ద నున్న కౌంటరుతో అనుసంధానం చేసి టోకన్లు ద్వారా యాత్రికుల వసతి సముదాయములో ఉచిత లాకరు, ఉచితముగా తలనీలాల సమర్పణ, ఉచిత భోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో నడిచివెళ్ళే యాత్రికుల కొఱకై ప్రత్యేకంగా కొన్ని కంపార్టుమెంట్లను అందుబాటులో ఉంచాలని ఆయన సంబందిత అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన పనులన్నీ వేగంగా పూర్తి చేసి మరో పదిహేను రోజులలోపు ఈ పద్దతిని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి, తిరుపతి జె.ఇ.ఓ. శ్రీ వి.శేషాద్రి, ముఖ్య భద్రతాధికారి శ్రీ పి.వి.ఎస్‌. రామకృష్ణ, ఇ.డి.పి. మేనేజర్‌ సి. భాస్కర్‌ ఇతరులు పాల్గొన్నారు.
 
తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి ఛైర్మెన్‌ శ్రీ డి.కె. ఆదికేశవులు, కార్యనిర్వహణాధికారి డా.కె.వి. రమణాచారి భక్తులకు, తి.తి.దే. ఉద్యోగులకు శ్రీ విరోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.