REVIEW MEETING HELD BY TTD OFFICIALS _ టిటిడి ఉద్యోగులకు అందిస్తున్న వైద్యంపై ఈవో స‌మీక్ష‌

Tirupati, 17 July 2020: A review meeting was held by TTD officials to assess the COVID cases among TTD employees.

TTD EO Sri Anil Kumar Singhal discussed in detail over the COVID situation in his chambers in TTD Administrative building on Friday evening along with Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti along with SVIMS Director Dr Vengamma. 

The EO reviewed on the situation of COVID cases which are increasing day by day in Tirupati including those of TTD employees.   

He also reviewed on the medication and diet that are being provided to TTD employees and instructed the officials concerned not to compromise in providing the best possible treatment and dietary to the COVID affected TTD employees.

One of the archakas who was tested Positive for Corona, has been suffering from chronic diabetes and Hypertension. He is now stable. However, he will be provided better medication at Apollo Hospital in Chennai.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఉద్యోగులకు అందిస్తున్న వైద్యంపై ఈవో స‌మీక్ష‌

తిరుప‌తి, 17 జూలై 2020: క‌రోనా పాజిటివ్ కార‌ణంగా స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉద్యోగుల‌కు అందిస్తున్న వైద్య సౌక‌ర్యాల‌పై, క్వారంటైన్‌లో ఉన్నవారికి అందిస్తున్న వైద్యం, ఆహారం త‌దిత‌ర సౌక‌ర్యాల‌‌పై టిటిడి ఈఓ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స‌మీక్షించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో శుక్ర‌వారం రాత్రి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, స్విమ్స్ డైరెక్ట‌ర్ డా. వెంగ‌మ్మతో ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.

స్విమ్స్‌లో ఎంత మంది ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు, క్వారంటైన్‌లో ఎంత‌మంది ఉద్యోగులు ఉన్నారు, వారి ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంది త‌దిత‌ర అంశాల‌పై ఈవో స‌మీక్షించారు. కాగా, శ్రీ‌వారి ఆల‌యంలో సేవ‌లందిస్తున్న ఒక అర్చ‌కుడు ఇదివ‌ర‌కే షుగ‌రు, బిపి, హైప‌ర్‌టెన్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారు. వారికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో స్విమ్స్‌లో మెరుగైన‌ వైద్యం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. వారికి మ‌రింత మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.