REVIEW MEETING HELD ON SV MUSEUM FACELIFT WORKS _ భక్తులను ఆధ్యాత్మికంగా మరింత ఆకట్టుకునేలా ఎస్వీ మ్యూజియం
GET IT READY BY 2023 SRIVARI BRAHMOTSAVAMS-EO
TIRUMALA, 09 APRIL 2022: A review meeting on the status of development works which are under progress in SV Museum at Tirumala was held in Sri Padmavathi Rest House on Saturday evening by TTD EO Dr KS Jawahar Reddy.
The experts from TATA Group and MAP Systems briefed the EO virtually through PowerPoint Presentation on the progress of works which includes segregation and auditing of silver, bronze, stone, wood idols, weapons, musical instruments etc.
They said out of 8779 artefacts available digitisation works of 7579 have been completed so far and remaining 1200 will be completed soon.
The EO asked the experts from both the firms which are doing the facelift works of SV Museum with state of art technology on a CSR basis to ensure that the new-look museum will be inaugurated and open for pilgrims by the 2023 annual Srivari Brahmotsavams.
Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, GM IT Sri Sesha Reddy, Director of Museum Dr Vibhishana Sharma, seven-member expert committee on SV Museum and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
భక్తులను ఆధ్యాత్మికంగా మరింత ఆకట్టుకునేలా ఎస్వీ మ్యూజియం
2023 శ్రీవారి బ్రహ్మోత్సవాలనాటికి సిద్ధం చేయండి – టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల, 2022 ఏప్రిల్ 09: తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో భక్తులను ఆధ్యాత్మికంగా మరింత ఆకట్టుకునేలా ఎస్వీ మ్యూజియంను సిద్ధం చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో శనివారం సాయంత్రం ఈవో మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 2023 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి కొత్త హంగులతో మ్యూజియాన్ని సిద్ధం చేయాలన్నారు. యాత్రికులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీఎస్‌ఆర్ ప్రాతిపదికన ఎస్వీ మ్యూజియం పనులు చేస్తున్న టాటా గ్రూప్ మరియు మ్యాప్ సిస్టమ్స్‌కు చెందిన సంస్థల నిపుణులను ఈవో కోరారు.
టాటా గ్రూప్ మరియు మ్యాప్ సిస్టమ్స్‌కు చెందిన నిపుణులు, వెండి, కాంస్య, రాయి, చెక్క విగ్రహాలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలు మొదలైన వాటి విభజన మరియు ఆడిటింగ్‌తో కూడిన పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. అందుబాటులో ఉన్న 8779 కళాఖండాలలో 7579 డిజిటలైజేషన్ పనులు పూర్తి చేశామని, మిగిలిన 1200 త్వరలో పూర్తి చేస్తామని వారు తెలిపారు.
అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, ఎస్వీ మ్యూజియం కమిటీ సభ్యులు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.