REVIEW MEETING HELD ON VEDIC ACADEMICS BY EO _ వేద వారసత్వాన్ని, విజ్ఞానాన్ని సమిష్టిగా భావి తరాలకు అందించాలి- వేద విశ్వవిద్యాలయం అకాడెమిక్స్‌పై సమీక్ష : టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

TIRUPATI, 30 JANUARY 2023: TTD EO Sri AV Dharma Reddy on Monday held a detailed review meeting on academic and administrative issues related to Vedic Studies in Tirupati.

 
The meeting was held in Sri Venkateswara Vedic University along with the Vice-Chancellor of SVVU Sri Rani Sadasiva Murty and JEO (H & E) Smt Sada Bhargavi. 

Speaking on this occasion, the EO called on all the Vedic scholars of the University and Veda Pathashalas to work together in taking forward the vedic legacy and knowledge to future generations. “All the TTD vedapathashalas should be affiliated to SVVU to have a uniform academic syllabus and action plan. In the next level, all the vedic pathashalas in the state should be brought under SVVU and finally across the country including the private Veda pathashalas. This will provide a strong base to take forward our ancient knowledge”, he added.

Earlier the VC of SVVU and Principals of all the TTD-run Veda pathashalas presented their issues related to their respective institutions through power point presentation over the requirement of teaching staff for some Vedic subjects in some schools, infrastructure facilities, manpower requirement etc.

The EO also directed to form an academic body and carryout monthly meetings to resolve the issues. He also asked the VC to inspect all the TTD Veda Pathashalas by allocating the work of each dean to each one of the institutions. 

VARSITY CAMPUS TO GET DIVINE LOOK

Later the VC explained the EO over the proposed plan to improve the ambience in the varsity campus by developing greenery which includes Yagna Vriksha Vatika, Sila Vanam(with the sculptures of Sages), Dhanwantari Vanam with medicinal plants, Navagraha Vatika, Nakshatra Vanam and a lotus pond.

Varsity Registrar Sri Radheshyam, DEO Sri Bhaskar Reddy, DyEO Sri Govindarajan, Principals of all Veda Pathashalas of TTD, EE Sri Mallikharjuna prasad and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేద వారసత్వాన్ని, విజ్ఞానాన్ని సమిష్టిగా భావి తరాలకు అందించాలి

– వేద విశ్వవిద్యాలయం అకాడెమిక్స్‌పై సమీక్ష : టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుపతి, 2023 జనవరి 30: వేద వారసత్వాన్ని, విజ్ఞానాన్ని భావి తరాలకు అందించేందుకు యూనివర్సిటీ, వేదపాఠశాలల వేద పండితులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ఈవో సోమవారం వేద విద్య మరియు పరిపాలనా అంశాలపై వైస్-ఛాన్సలర్ శ్రీ రాణి సదాశివ మూర్తి, జెఈవో శ్రీమతి సదా భార్గవితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ వేదపాఠశాలలన్నింటిలో ఒకే రకమైన పాఠ్యాంశాలు కలిగి ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ఎస్వీవియూకి అనుబంధంగా ఉండాలన్నారు. తరువాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని వేద పాఠశాలలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ వేద పాఠశాలలను కూడా ఎస్వీవియూ పరిధిలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
తద్వారా “మన ప్రాచీన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బలమైన పునాది” అవుతుందని ఈవో తెలిపారు.

అంతకుముందు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, టిటిడి ఆధ్వర్యంలో నడిచే అన్ని వేద పాఠశాలల ప్రిన్సిపాల్‌లు పాఠశాలల్లోని విద్యార్థులు బోధన సిబ్బంది అవసరాలు, మౌలిక సదుపాయాలు, ఖాళీగా ఉన్న పలు శాఖల భర్తీలు తదితర సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ వోకు వివరించారు.

సమస్యల పరిష్కారానికి అకడమిక్ బాడీని ఏర్పాటు చేసి నెలవారీ సమావేశాలు నిర్వహించాలని ఈవో ఆదేశించారు. ఒక్కో డీన్ కు ఒక్కో సంస్థను కేటాయించి, టీటీడీ వేద పాఠశాలలన్నింటినీ తనిఖీ చేయాలని విసిని కోరారు. తద్వారా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు.

మరింత ఆహ్లాదకరంగా రూపొందనున్న విశ్వవిద్యాలయం ప్రాంగణం :

అనంతరం వేద విశ్వ విద్యాలయం ప్రాంగణంలో యజ్ఞ వృక్ష వాటిక, ఋషుల శిల్పాలతో కూడిన శిలా వనం, ఔష ధి మొక్కలతో కూడిన ధన్వంతరి వనం, నవగ్రహ వాటిక, నక్షత్ర వనం, తామర చెరువు వంటి వినూత్నమైన అంశాలతో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించే ప్రతిపాదిత ప్రణాళికను విసి
ఈవోకు వివరించారు.

విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీ రాధేశ్యామ్, డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, టీటీడీలోని అన్ని వేదపాఠశాలల ప్రిన్సిపాల్స్, ఈఈ శ్రీ మల్లిఖార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.