Review Meeting with All HODs of TTD in TTD Adm Bldg meeting Hall _ సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచడానికి కృషిచేయాలి:  తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు 

Tirupati, 18 June 2009: Sri I.Y.R.Krishna Rao, Executive Officer TTDs held a review meeting with all HODs of TTD in Adm Bldg Meeting Hall in Tirupati on Thursday evening.
 
Dr K.V.Ramanachary, Outgoing Executive Officer, TTD is also present along with HODs.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచడానికి కృషిచేయాలి :  తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు

తిరుపతి, జూన్‌-18,  2009: మన ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు కలసి కొనసాగిస్తూ, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేస్తూ సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచడానికి కృషిచేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు అన్నారు. గురువారం సాయంత్రం తితిదే పరిపాలనాభవనంలో తితిదే అధికారులతో పరిచయ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇ.ఓ మాట్లాడతూ తితిదేలోని ప్రతి విభాగంలోనూ పనిచేసే ఉద్యోగులు తన విభాగంలో తను చేయాల్సిన విధులు సక్రమంగా నిర్వర్తించడమేగాక, ఎప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ వీలైనంత మందికి, సంస్థకు ఉపయోగపడే పనులు చేయడానికి కృతనిశ్చయులుగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసిన బదిలీపై వెళ్తున్న డా||కె.వి.రమణాచారి అధికారులను, ఉద్యోగులను పేరుపేరున నూతన ఇ.ఓకు పరిచయం చేశారు.

ఈ సందర్భంగా డా||కె.వి.రమణాచారి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సర్వీసులో తనమాట, నడక, నడత ఎంతబాగుంటే ఎదుటవారు అంత బాగుంటారని, 2ఏళ్ళు, 2నెలల కాలం ఉద్యోగులు అందించిన చేయూత, సహకారం చాలాగొప్పది అని అన్నారు. క్షణకాలం స్వామిదర్శనం దొరికితే ఆజ్ఞాపకాన్ని జీవితకాలం భక్తులు దాచుకుంటారని, తితిదే ఉద్యోగులపట్ల ప్రజలందరికి గౌరవభావం ఉందని, భక్తులకు మరిన్ని సేవలు చేస్తూ ఆ గౌరవభావాన్ని కాపాడుకోవాలని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్యభద్రతాధికారి శ్రీపి.వి.ఎస్‌.రామకృష్ణ, ఛీఫ్‌ ఇంజనీరు శ్రీవి.ఎస్‌.బి.కోటేశ్వరరావు, ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీఆర్‌.ప్రభాకర్‌ రెడ్డి, ఇతర అధికారులు, సంఘనాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.