REVIEW ON VEDA PATHASHALAS DEVELOPMENT HELD _ వేద పాఠశాలల అభివృద్ధి పనుల కోసం వారం రోజుల్లో డిపిఆర్ లు
TIRUPATI, 29 DECEMBER 2021: To encourage the outgoing students who have completed their Vedic course in all the six TTD Vedapathashalas, we are contemplating providing an opportunity as apprentices in TTD-run temples to train them in temple-related activities in a better view, said TTD JEO (H & E) Smt Sada Bhargavi.
A review meeting with all the Principals of TTD-run Veda pathashalas apart from Dharmagiri was held by the JEO at Sri Padmavathi Rest House in Tirupati on Wednesday.
Speaking on the occasion, the JEO said the meeting reviewed the development activities to be taken up in all the Veda Pathashalas, the required training to be imparted to the Vedic students for their bright future, how to overcome the drawbacks in the infrastructure facilities, etc.
She said the focus has been laid on how to develop all the five other Veda Pathashalas on par with Dharmagiri Veda Vignana Peetham in Tirumala. All the Principals of the respective Vedic institutions have also been directed to submit a DPR within a week to take up necessary improvements”, she added.
The JEO also said, all the concerned have also been instructed to perform Go puja in their respective Veda pathshalas. The development of Veda Pathashalas shall be developed with a traditional outlook. We have also discussed certification, university affiliation, etc. To encourage the students, a two-year apprenticeship in TTD temples has also been mulled to sharpen their experience and knowledge”, she maintained.
Devasthanam Educational Officer Sri C Govindarajan, all the Principals of Veda Pathashalas of TTD were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వేద పాఠశాలల అభివృద్ధి పనుల కోసం వారం రోజుల్లో డిపిఆర్ లు
– వేద విద్యార్థులకు వర్క్ షాపులు, క్షేత్ర పర్యటనలు ఏర్పాటు చేయాలి
టీటీడీ జెఈవో (విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి 29 డిసెంబరు 2021: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల అభివృద్ధి పనుల కోసం వారం రోజుల్లో సమగ్ర నివేదిక (డిపిఆర్) సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని జెఈవో (విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని టీటీడీ వేద పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులతో బుధవారం శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, తిరుమల ధర్మగిరి వేద విద్యా పీఠం తరహాలో మిగిలిన వేద పాఠశాలల అభివృద్ధి జరగాలని చెప్పారు. పాఠశాలల భవనాలు, తరగతి గదులు పర్ణశాల తరహాలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకాల కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు వేద విద్య పూర్తయ్యాక ఉపాధి కోసం వెతుక్కోకుండా, టీటీడీ ఆలయాల్లో వేద పారాయణం కోసం రెండు సంవత్సరాల పాటు అప్రెంటీస్ ఇచ్చే ఆలోచన చేయాలన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను బయటకు తెచ్చేందుకోసం వారికి వర్క్ షాప్ లు, క్షేత్రస్థాయి పర్యటనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జెఈవో అధికారులను ఆదేశించారు. వేద విశ్వవిద్యాలయం గుర్తింపు,విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు ఎలా ఉండాలనే విషయం పై అధికారులతో ఆమె చర్చించారు. వేద పాఠశాలల్లో ప్రతి రోజు గో పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
దేవస్థానం విద్యాశాఖ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ గోవింద రాజన్, ఎస్ ఈ శ్రీ సత్యనారాయణ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది