RFID TO PROVIDE SECURITY TO JEWELS IN SRI GT – JEO_ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : జెఈవో
Tirupati, 11 March 2019: The Radio Frequency Identity Device (RFID) will provide security to the jewels and on a experimental basis this has been introduced in Sri Govinda Raja Swamy (Sri GT) temple in Tirupati, said TTD JEO Sri B Lakshmikantham.
During his inspection in Sri GT on Monday, this technology will help to prevent thefts in the temple. Sensormatic chips will be arranged to jewels and if anybody tries for mischief they will be caught red-handed he maintained. “Initially we arrange this in GT on the advise of Agama experts and later will extend the same to other temples”, he added.
SE I Sri Ramesh Reddy, SE Electrical Sri Venkateswarulu, Spl Gr Dy EO Smt Varalakshmi, AVSO Sri Rajesh were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : జెఈవో
మార్చి 11, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రాబోయే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో అధికారులతో కలసి జెఈవో సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువపందిళ్లు, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టిటిడి ఆలయాల ఆభరణాలపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ముందుగా శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రయోగాత్మకంగా రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెండిటి డివైజ్ (ఆర్.ఎఫ్.ఐ.డి) టెక్నాలజీ ద్వారా ఆభరణాలకు భద్రత కల్పిస్తామన్నారు. ఆభరణాలకు సెన్సార్‌మేటిక్ చిప్స్ ఏర్పాటు చేయడం వల్ల ఏవరైనా దురుద్దేశంతో తరలిస్తే తక్షణం గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆగమ సలహాదారుల సలహా మేరకు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, దశలవారీగా మిగిలిన టిటిడి స్థానిక ఆలయాలలో అమర్చుతామన్నారు.
జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, ఏవిఎస్‌వో శ్రీ రాజేష్ తదితరులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.