SADHU SUBRAHMANYA SHASTRI VARDHANTI OBSERVED_ ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 36వ వర్ధంతి

Tirupati, 10 Sep. 17: The 36th Death Anniversary of great scholar, epgraphist, multi talented personality Sri Sadh Subrahmanya Shastry 36th Death Anniversary was observed by TTD on Sunday.

Garlanding the life size statue of Sri Shastry located opposite SVETA building in Tiruoati, the HDPP Secretary Sri Ramakrishna Reddy said, the life of Sri Shastry itself is an encyclopaedia for the research students. “He is not only a scholar but dedicated his entire life in the service of Lord Venkateswara by bringing to light the rare manuscripts and inscriptions on the walls of Tirumala temple in the form of books through extensive research.

While SVETA OSD Smt Chenchulakshmi said, Sri Sastry rendered services in Tirumala temple as Peishkar. “He brought to the fore the information embedded in 1167 copper plates and also some thousands of Annamacharya sankeertans to limelight”, she added.
Later the TTD officials felicitated Sri Shastry’s grand daughter Smt Girija Shastry on this occasion.

Vengamamba project co-ordination Dr KJ Krishnamurthy was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 36వ వర్ధంతి

తిరుపతి, 2017 సెప్టెంబరు 10: టిటిడిలో శాసన అధ్యయనకారుడిగా పనిచేసి శ్రీవారి వైభవాన్ని, చరిత్రను యావత్‌ ప్రపంచానికి అందించిన శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 36వ వర్ధంతిని ఆదివారం తిరుపతిలోని శ్వేత భవనంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 9.00 గంటలకు శ్వేత భవనం ముందున్న సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే కాకుండా శాసన అధ్యయనకారుడిగా స్వామివారి వైభవాన్ని మొట్టమొదట చాటిచెప్పిన ఘనత శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యానిదే అన్నారు. ఇలాంటి వ్యక్తులు ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమని, వారిని స్మరించుకోవడమంటే స్వామివారిని సేవించుకోవడమేనని చెప్పారు.

శ్వేత సంచాలకులు శ్రీమతి చెంచులక్ష్మీ మాట్లాడుతూ శాస్త్రిగారు ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను అనువదించారని, అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా కీర్తనలను వెలుగులోకి తెచ్చారని తెలిపారు.

అనంతరం శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి కుమార్తె శ్రీమతి గిరిజా శాస్త్రి, ఇతర కుటుంబ సభ్యులను శాలువతో సత్కరించి, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను, చిత్ర పటాన్ని బహుకరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ కె.జె. కృష్ణమూర్తి, శాస్త్రిగారి ప్రథమ శిష్యుడు శ్రీ క్రిష్ణారెడ్డి, ఇతర అధికారులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.