ROOMS ALLOT ROOMS ALLOT WITH FRT CURBED DALARI SYSTEM- EO _ తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తులకు వేగంగా గదుల కేటాయింపు
ACCOMMODATION REGISTRATION COUNTERS SHIFTED TO CRO ON A TRIAL BASIS
TIRUMALA, 14 MARCH 2023: The Face Recognition Technology (FRT) implemented by TTD has enhanced transparency in room allotment system and curbed the menace of Dalaris said TTD EO Sri AV Dharma Reddy.
Speaking to the media at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the EO said the devotees are now getting accommodation within 5-10 minutes without any inconvenience. The rotation of rooms which used to be rampant earlier due to the middlemen has now curtailed with the introduction of FRT. Even the refund is also given to the devotee who was allotted the room with their Adhaar card. Once again a devotee will get a room only after a span of a month. With this new system which was introduced on March 1 onwards, till March 12, the revenue garnered by TTD in accommodation was Rs. 2.95 crores. Same system is being implemented in Advance booking and Current booking systems also, EO maintained.
On an experimental basis, the registration of names in counters located at various places in Tirumala will be shifted to CRO. The EO also said the FRT enabled in Vaikuntham 2 for distribution free laddus to devotees has also yielded good results putting an end to dalari menace. At present laddu token will be issued only in person to a devotee, he added.
Earlier, a PowerPoint presentation was shown to the media and the accommodation allotment system with FRT was explained.
CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, DyEOs Sri Ramesh Babu, Sri Harindranath, Sri Bhaskar, AE0 Sri Venkateswarulu Naidu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తులకు వేగంగా గదుల కేటాయింపు
– గదుల రొటేషన్, దళారి వ్యవస్థ తగ్గింది
– గదుల రిజిస్ట్రేషన్ కౌంటర్లను ప్రయోగాత్మకంగా సి ఆర్ ఓ వద్దకు మార్పు
– ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2023 మార్చి 14: శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు . దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందన్నారు తెలిపారు. సామాన్య భక్తులు ఎవరైతే గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో, వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ చేయడం జరుగుతుందన్నారు. ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే గదులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు.
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సిఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు తెలిపారు. తద్వారా వ్యక్తి లేకుండా లడ్డు టోకెన్ రాదన్నారు.
అంతకుముందు మీడియా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల భక్తులు పొందుతున్న సౌకర్యాలను వివరించారు.
ఈ సమావేశంలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈవోలు శ్రీ హరింద్రనాథ్, శ్రీ భాస్కర్, ఏఈఓ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.