ROUND THE CLOCK MONITORING OF CC CAMERAS –TTD CV & SO_ శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో 24 I7 గంటలపాటు భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ
Tirupati, 13 September 2017: To ensure safety to both pilgrims and TTDs assets at any point of time, round the clock CC TV monitoring need to be enhanced in Tirumala Command Control Room during the ensuing annual brahmotsavams, said TTD CV&SO Sri Ake Ravi Krishna.
A review meeting with all the Vigilance and Security officials of TTD was held in the chambers CV&SO in Tirupati on Wednesday on the preparatory security measures for brahmotsavams and in general. During the monthly review meeting the CV&SO directed his sleuths to be more vigilant while discharging duties. Some excerpts of the meeting:
New gadgets that are being used in Airport for security check are being procured and installed shortly in TTD to stop antisocial elements at Alipiri and other areas in Tirupati.
A proposal has been sent to the Director General by Assistant Divisional Fire Officer through CV&SO for fixed fire-fighting installations in Tirumala since at present only first aid firefighting machines are available in TTD.
To prevent encroachments by license holders, unauthorized Hawkers and exploitation of pilgrims and hitech begging.
Frisking of pilgrims even at Kalyana Katta Complex and Annaprasadam complex and CCTV cameras should be monitored with more attention.
The movement of traffic on both Ghat roads should be monitored continuously and whenever there is a traffic jam, it should be immediately informed to Command & Control Room at Tirumala immediately, in addition to informing to Local Police.
For Garuda Seva, special arrangements with regard to parking for two wheelers should be made in consultation with TTD Engineering department.
The Additional CVSO Sri Siva Kumar Reddy, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi, AVSOs, VIs were also present during the review meeting.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో 24 I7 గంటలపాటు భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ
సెప్టెంబర్ 13, తిరుపతి, 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రతను, టిటిడి ఆస్తులను 24 గంటల పాటు ఆయా ప్రాంతాల్లోని సిసి కెమెరాల ద్వారా తిరుమలలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ తెలిపారు. తిరుపతిలోని సివిఎస్‌వో కార్యాలయంలో బుధవారం ఆయన టిటిడి నిఘా, భద్రత అధికారులతో నెలవారీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో నిఘా, భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తిరుపతిలోని అలిపిరి చెక్ పాయింట్, ఇతర టిటిడి సంస్థల్లో అసాంఘికశక్తుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్టుల తరహాలో త్వరలో భద్రతా పరికరాలను ఏర్పాటుచేస్తామన్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఆధునిక అగ్నిమాపక పరికరాలను సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తిరుమలలో ఆక్రమణదారులను, అనధికారిక హాకర్లను, యాచకులను, భక్తులను మోసగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కల్యాణకట్ట, అన్నప్రసాదం కాంప్లెక్స్‌ల్లో సిసి కెమెరాలతో మరింత భద్రతను పెంచుతామని సివిఎస్‌వో తెలిపారు. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తామని, వాహనాలు స్తంభించిన సమయాల్లో వెంటనే తిరుమలలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేస్తామని చెప్పారు. సెప్టెంబరు 27న గరుడసేవ రోజు ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.