Rs.1.11 CRORE DONATION TO TTD SV GOSAMRAKSHANA TRUST _ టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
Tirumala, September 7, 2026: Hyderabad-based donor Kunchala Madhuram Reddy makes generous contribution
Hyderabad Banjara Hills-based donor Sri Kunchala Madhuram Reddy donated Rs.1.11 crore to the TTD Sri Venkateswara Gosamrakshana Trust on Monday.
The donor met TTD Chairman Sri B.R. Naidu at the TTD Camp Office in Hyderabad and handed over the donation.
Sri B.R. Naidu appreciated Sri Madhuram Reddy for his generous contribution towards Gosamrakshana and Goseva. He said the support extended by devotees and donors is valuable in strengthening TTD’s cow protection activities.
He added that TTD will continue to expand its Gosamrakshana programmes with the continued support of devotees and donors.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన కుంచాల మధురాం రెడ్డి విరాళం
తిరుమల, 2026 సెప్టెంబరు 07: టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్‌కు హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ దాత శ్రీ కుంచాల మధురాం రెడ్డి రూ.1.11 కోట్ల భారీ విరాళాన్ని అందించారు.
సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడును కలిసి దాత ఈ విరాళాన్ని అందజేశారు.
గోసంరక్షణ, గోసేవకు పెద్దపీట వేస్తున్న టీటీడీకి అండగా నిలిచి, భారీ విరాళం అందించిన దాత శ్రీ కుంచాల మధురాం రెడ్డిని చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు అభినందించారు.
గోవుల సంరక్షణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, భక్తులు, దాతల సహకారంతో టీటీడీ గోసంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుందని తెలిపారు.

