Rs100 CRORE MODERNISATION WORKS IN ALL TIRUMALA REST HOUSES- ADDL. EO _ తిరుమలలోని అతిథి గృహాలలో సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 12 Dec. 19: Additional Executive Officer Sri AV Dharma Reddy said the modernisation works worth ₹100 crore have been taken up at all rest houses in Tirumala.

He made an inspection tour of all rest houses on its maintenance and devotee friendly facilities on Thursday along with accommodation engineering and FMS officials.

He said the works to be completed in four months that included change of furniture, doors,fans,replastering ceiling,painting,electrical works etc .

He visited Sannidhanam, Shankumitta,SNC,Adisesham rest houses.

DyEO R-1 Sri Balaji, SE-2, Sri Nageswara Rao and FMS officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

తిరుమలలోని అతిథి గృహాలలో సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

డిసెంబరు 12, తిరుమ‌ల‌, 2019: తిరుమలలోని వివిధ అతిథి గృహాల నిర్వహణ, భ‌క్తుల‌కు అందిస్తున్న‌సౌక‌ర్యాల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి గురువారంనాడు వ‌స‌తి, ఇంజనీరింగ్‌, ఎఫ్‌.ఎమ్‌.ఎస్‌. అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు రూ. 100 కోట్ల‌తో తిరుమ‌ల‌లోని అతిథి గృహాల అధునీక‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా గ‌దుల‌లో ఫ‌ర్నిచ‌ర్ మార్పు, త‌లుపులు, ఫ్యాన్లు,  పైక‌ప్పు మ‌ర‌మ‌త్తులు, గోడ‌ల‌కు పెయింటింగ్‌, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌ ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. మ‌రో 4 నెల‌లో ప‌నులు పూర్తి చేసి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకువ‌స్తామ‌న్నారు.  

అంత‌కుముందు స‌న్నిధానం, శంఖుమిట్ట‌, ఎస్‌.ఎమ్‌.సి., అదిశేషు అతిథి గృహాల‌ను అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. వ‌స‌తి గృహాలలోని స్నాన‌పు గ‌దులలో వేడి నీరు,  పారిశుద్ధ్యం త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.  

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌-1 శ్రీ బాలాజి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్‌.ఎమ్‌.ఎస్‌. అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.