RUDRA YAGAM AND LAKSHA BILWARCHANA HELD AT KAPILA THEERTHAM _ శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం, లక్ష బిల్వార్చన

Tirupati, 3 Dec 20: As part of month long Karthika Masa Homa Mahotsavams in the famous shrine of Lord Shiva at Sri Kapilatheertham in Tirupati, Rudra Yagam and Laksha Bilwarchana were performed with utmost religious fervour on Thursday.

The Rudra Yagam will last upto December 13 for 11 days. Acharya Pavana Kumara Sharma narrated the importance of Rudra Yagam.

Rudra Japam, Homam, Laghu Purnahuti, Rudra Trisati, Bilwarchana, Nivedana, Visesha Deeparadhana, Harati were rendered.

While the Laksha Bilwarchana was also observed in the temple between 6am and 12 noon.

UMA MAHESWARA VRATAM HELD 

As part of Karthika Masa Deeksha, Uma Maheswara Vratam was held in the morning between 8:30am and 9:30am which was telecast live on SVBC. 

Deputy EO Sri Subramanyam, Superintendent Sri Bhupathi Raju and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTD, TIRUPATI  

శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం  ప్రారంభం & లక్ష బిల్వార్చన

తిరుప‌తి‌, 2020 డిసెంబ‌రు 03: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్నహోమ మహోత్సవాల్లో భాగంగా  డిసెంబ‌రు 13వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

క‌పిల‌తీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ ఉమామ‌హేశ్వ‌ర వ్ర‌తం

కార్తీక మాస దీక్ష‌ల్లో భాగంగా గురువారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో శ్రీ ఉమామ‌హేశ్వ‌ర వ్ర‌తం శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఈ సంద‌ర్భంగా పండితులు శ్రీ ప‌వ‌నకుమార శ‌ర్మ వ్ర‌తం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. ప‌ర‌మేశ్వ‌రునికి ప్రీతిపాత్ర‌మైన శోడ‌షోప‌చార ప‌ద్ధ‌తిలో ఈ వ్ర‌తం జ‌రుగుతుంద‌న్నారు. ఉమ‌(పార్వ‌తి), మ‌హేశ్వ‌రుడు ఆది దంప‌తుల‌ని, వీరిని పూజిస్తూ వ్ర‌తం చేస్తే ఐశ్వ‌ర్యం, మాంగ‌ళ్యసిద్ధి క‌లుగుతాయ‌ని వివరించారు.

ముందుగా ఉమామ‌హేశ్వ‌రుల‌కు ప్ర‌తీక‌గా క‌ల‌శంపై స‌గ‌భాగం కుంకుమ, మ‌రో సగ భాగం పసుపుతో శివ‌లింగాకృతిని రూపొందించారు. సంక‌ల్పంతో ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ వ్ర‌తం ముగిసింది.

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం లక్ష బిల్వార్చన సేవ జరిగింది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ సేవ నిర్వ‌హించారు.

యాగశాల మండపంలో ఉద‌యం 6 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.