RUDRABHISHEKAM AT DHYANARAMAM CONCLUDES _ ధ్యానారామంలో ముగిసిన రుద్రాభిషేకం

HOMA MAHOTSAVAMS CONCLUDE AT SRI KT

DHANA VRATAM ON DECEMBER 15

Tirupati, 14 Dec. 20: The month-long ceremonious Rudrabhishekam performed to 12-feet giant Shiva Linga located in Dhyanaram near SV Vedic University concluded on a religious note in Tirupati on Monday. The programme was telecasted live on SVBC from November 16 till December 14 between 6am and 6:45am, which was witnessed, by millions of devotees across the globe.

Explaining about the significance of Rudrabhishekam, Acharya Sannidhanam Sudarshana Sharma, Vice-Chancellor Sri Venkateswara Vedic University said, the month long Rudrabhishekam in Dhyanaramam was a unique event contemplated by TTD for the first time. Karthika Masam is considered equally important to Siva-Kesava Smaranam. In Tirumala, TTD observed, month-long Vishnu Puja Deeksha at Vasantha Mandapam while in Tirupati, Rudrabhishekam at Dhyanaramam, he observed.

Later, Rudrabhishekam was performed with all sacred materials including milk, curd, ghee, honey, turmeric, vermilion, sandal paste, vibhoodi and finally Naivedyam and Harati were rendered to the Siva Lingam amidst chanting of Namaka, Chamaka and other hymns as per Saiva tradition.

TTD EO Dr KS Jawahar Reddy, CEO SVBC Sri Suresh Kumar and others were also present. 

DHANA VRATAM ON DECEMBER 15

The unique Dhana Vratam will be observed at the Yagashala of Sri Venkateswara Vedic University on Tuesday between 8am and 9am.

AT KAPILESWARA SWAMY TEMPLE

As part of Karthika Masa Homa Mahotsavams held at Sri Kapileswara Swamy temple in Tirupati, the month long fete concluded with Siva Somavara Vratam on the last Monday in the auspicious Karthika Month.

Renowned scholar Sri Pavana Kumara Sharma explained the significance of the Vratam and said it will yield fruits of health and prosperity to the entire humanity.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi Raju and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్యానారామంలో ముగిసిన రుద్రాభిషేకం

డిసెంబ‌రు 15న ధ‌న వ్ర‌తం

క‌పిల‌తీర్థంలో ముగిసిన హోమ మ‌హోత్స‌వాలు

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 14: తిరుప‌తిలోని వేద వ‌ర్సిటీలో గ‌ల‌ ధ్యానారామంలో 12 అడుగుల శివ‌లింగానికి నెల రోజుల పాటు జ‌రిగిన రుద్రాభిషేకం సోమ‌వారం ఘ‌నంగా ముగిసింది. న‌వంబ‌రు 16 నుండి డిసెంబ‌రు 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉద‌యం 6 నుండి 6.45 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన ఈ రుద్రాభిషేకాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా లక్ష‌లాది మంది భ‌క్తులు వీక్షించారు.

ఈ సంద‌ర్భంగా వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ మాట్లాడుతూ టిటిడి మొట్ట‌మొద‌టిసారిగా విశిష్ట‌మైన రుద్రాభిషేకాన్ని నిర్వ‌హించింద‌న్నారు. కార్తీక మాసంలో శివ కేశ‌వుల స్మ‌ర‌ణకు స‌మాన‌మైన ప్రాధాన్యం ఉంద‌ని చెప్పారు. నెల రోజుల పాటు తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో అశ్వ‌త్థ‌పూజ‌, సాల‌గ్రామ పూజ‌, రాధా దామోద‌ర వ్రతం, తుల‌సీ ధాత్రీ దామోద‌ర వ్ర‌తం, గోపూజ‌, విష్ణుపూజ‌లు, వ్ర‌తాలు, తిరుప‌తి క‌పిల‌తీర్థం ఆల‌య ప్రాంగ‌ణంలో శివ‌పూజ‌లు, త్రిలోచ‌న గౌరీ వ్ర‌తం, స్కంధ ష‌ష్టి, సంక‌ష్ట‌హ‌ర గ‌ణ‌ప‌తి వ్ర‌తం, శివ‌సోమ‌వార వ్ర‌తాలు నిర్వ‌హించిన‌ట్టు వివ‌రించారు.

అనంత‌రం శివ‌లింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ప‌సుపు, చంద‌నం, విభూది త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేశారు. వేద పండితులు న‌మ‌కం, చ‌మ‌కం ప‌ఠిస్తుండ‌గా నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

డిసెంబ‌రు 15న ధ‌న‌వ్ర‌తం

ధ‌నుర్మాస ప్రారంభ సూచిక‌గా డిసెంబ‌రు 15న మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు వేద వ‌ర్సిటీలోని యాగ‌శాల‌లో ధ‌న వ్ర‌తం జ‌రుగ‌నుంది.

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో

కార్తీక మాస దీక్ష‌ల్లో భాగంగా సోమ‌వారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో కార్తీక సోమ‌వార శివార్చ‌నం శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఈ సంద‌ర్భంగా పండితులు శ్రీ ప‌వ‌న కుమార శ‌ర్మ వ్ర‌తం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో సోమ‌వారం శివునికి అత్యంత విశేష‌మైనద‌న్నారు. రుద్ర‌పూజా విధానంలో స్వామి, అమ్మ‌వారిని అర్చించి వారి కృత‌ప‌కు పాత్రులు కావాల‌ని కోరారు. ఈ వ్ర‌తం ఆచ‌రించ‌డం వ‌ల్ల ఈతిబాధ‌లు, వ్యాధిబాధ‌లు తొల‌గి అంద‌రూ సుభిక్షంగా ఉంటార‌ని చెప్పారు.

ముందుగా పార్వతి పరమేశ్వరుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంక‌ల్పంతో ఈ పూజ‌ను ప్రారంభించి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

శ్రీ చండికేశ్వ‌ర‌స్వామివారి హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు సోమ‌‌వారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూల‌స్నానం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల‌స్నానం, అంకురార్పణ విసర్జన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.