RUKMINI KRISHNA TAKES PLEASURE RIDE FLOW_ తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

Tirumala, 17 Mar. 19: The processional deities of Sri Krishna Swamy along with Rukmini Devi tool celestial ride on the finely decked float on the second day on ongoing five day Teppotsavams in Tirumala.

Sunday evening witnessed the divine couple taking three rounds on the waters of Swamy Pushkarini.

HH Chinna Jiyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, Temple DyEO Sri Harindranath were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

తిరుమల, 2019 మార్చి 17: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.

కాగా, మూడవరోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.