SACRED DARBHA MATS HANDED OVER TO TEMPLE_ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భ సిద్ధం
Tirumala, 27 Sep. 19: The Forest Wing of TTD headed by Deputy Conservator of Forest Sri Phanikumar Naidu has handed over the sacred Darbha Mat and Rope to temple Deputy EO Sri Harindranath in Tirumala temple on Friday.
This Darbha Mat and Rope will be used during Dhwajarohanam fete on the first day of annual brahmotsavams on September 30. Usually, this sacred dried grass mat and thread are revered to be divine and have a very significant role to play in the Hindu religious festivals.
The botanical name of Darbha Grass is Eragrostis cynosuroides. In the desi language it is called Kuss. Our Vedas state that Darbha is an embodiment of Trinity. Lord Brahma-the Creator is stationed at the Root, Lord Vishnu-the Protector in the Middle and Lord Shiva-the Destroyer at the Tip of Darbha, hence making it significant in all Hindu rituals.
VADAMALAPETA SPECIAL
Meanwhile, the Darbha that is used in Brahmotsavam fete is specially grown in Vadamalapeta of Chittoor district. Special care is taken to grow this sacred grass. Later Darbha Mat and Rope are prepared by a team of experts in knitting the same with utmost devotion.
The Darbha Mat used for Dhwajarohanam is 6feet width and 22feet in length while the Darbha rope is 200 feet in length as it is tied alofduring thembham during the annual brahmotsavams.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భ సిద్ధం
తిరుమల, 2019 సెప్టెంబరు 27: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం కోసం టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును శుక్రవారం టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌కు అందించారు.
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది. ఈ దర్భను తిరుపతి సమీపంలోని వడమలపేట వ్యవసాయ పొలాల గట్ల నుండి సేకరించారు. ఈ దర్భను సేకరించిన తరువాత 15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు చాపను, 200 అడుగుల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఆర్‌వోలు శ్రీ ప్రభాకర్‌రెడ్డి, శ్రీ శివకుమార్, బొక్కసం ఇన్‌చార్జ్ శ్రీ గురురాజస్వామి, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.