SAHASRA KALASABHISHEKAM AND HANUMANTHA VAHANAM IN KRT ON MAY 13_ జూన్‌ 13న అమావాస్యనాడు శ్రీకోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

Tirupati, 11 June 2018: The monthly Sahasra Kalasabhishekam and Hanumantha Vahana Sevas will be observed in Sri Kodanda Rama Swamy Temple on May 13.

In the morning the abhishekam will be performed between 6am and 8am while Vahana Seva between 7pm and 9pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 13న అమావాస్యనాడు శ్రీకోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూన్‌ 13వ తేదీ బుధవారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. హనుమంతుడిని ‘సంకట మోచన’గా పిలుస్తారు. అనగా దుష్టశక్తులను నశింపజేసి చెడు ఆలోచనలను దూరం చేస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.