SAINT TYAGARAJA ARADHANOTSAVAMS OBSERVED IN TPT, KAKARLA_ తిరుపతిలో ఘనంగా శ్రీ త్యాగరాజస్వామివారి 171వ ఆరాధనోత్సవాలు

Tirupati, 6 January 2018: The 171st Aradhana Mahotsavams of Saint musician Sri Tyagaraja was observed with religious fervour in the temple city of Tirupati and in his turf at Kakarla in Prakasam district on Saturday by TTD.

Usually, every year, on the auspicious Pushya Bahula Panchami day, the day when saint composer attained Samadhi, the carnatic musicians all over the world pay tribute by rendering Tyagaraja Pancharathna Kritis and scores of other sankeertans penned by the great musician, fondly called by all as “Carnataka Sangeetha Pithamaha”.

Following the same trend, the SV College of Dance and Music run by TTD has also been observing the Tyagaraja Ardhana Mahotsavams from the past many years.

Earlier, during the day, special abhishekam was performed to the statue of saint poet in the college premises. Later the faculty and students lead a procession from the college to Mahati Auditorium. Rich tributes were paid to the great musician composer, by rendering his sankeertans in a befitting manner.

College Principal Smt YVS Padmavathi, lecturers and students took part in this fete.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

తిరుపతిలో ఘనంగా శ్రీ త్యాగరాజస్వామివారి 171వ ఆరాధనోత్సవాలు

వాగ్గేయకార చక్రవర్తికి సంకీర్తనల స్వరమాల

తిరుపతి, 2018 జనవరి 06: నాదయోగి, వాగ్గేయకార చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచిన సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం సంకీర్తనల స్వరమాల వేసి నివాళులు అర్పించింది. ఆయన 171వ పుష్యబహుళ పంచమి ఆరాధనోత్సవాన్ని శనివారం ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో సంగీత విద్వాంసులు, జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవర్ల సమక్షంలో పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ సంకీర్తనలను 108 మంది కళాకారులు బృందగానం చేసి ఆహూతులను సంగీత సాగరంలో ముంచెత్తారు.

ముందుగా ఉదయం 8.00 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో శ్రీత్యాగరాజస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులతో మంగళవాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం సంగీత కళాశాల నుండి ఉదయం 8.30 గంటలకు రెండున్నర అడుగుల ఎత్తుగల సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి నూతన పంచలోహ విగ్రహంతో నగర సంకీర్తనగా మేళతాళాలతో ఊరేగింపుగా మహతి సభామందిరానికి తీసుకువచ్చారు. అక్కడ ఆస్థానం, వేదపారాయణం చేపట్టారు.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.15 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర నాదస్వార పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులచే నాదస్వర కచ్చేరి నిర్వహించారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు శ్రీ ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులచే ”శ్రీ త్యాగరాజ విరచిత సంపూర్ణరామాయణ కృతులు” సుమధురంగా ఆలపించారు.

కాగా, మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 4.15 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే నాదస్వర కచ్చేరి నిర్వహించారు. సాయంత్రం 4.30 నుంచి 5.15 గంటల శ్రీ ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులచే ”శ్రీ త్యాగరాజ విరచిత ఉత్సవ, దివ్యనామ సంకీర్తనల” బృందం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వీణ, వేణువు, మృదంగం, తదితర వాయాద్యాలతో నాదనీరాజనం నిర్వహించారు.

తిరువయ్యారు తరహాలో పంచరత్న కృతుల బృందగానం :

శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవర్ల సమక్షంలో తమిళనాడులోని తిరువయ్యారు తరహాలో నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి ఘనరాగ పంచరత్న కృతుల బృందగానం సంగీతప్రియులను అలరించింది. పంచరత్న కృతుల్లో ”జగదానందకారక – జయజానకి ప్రాణనాయక” – నాటరాగం, ”దుడుకుగల నన్నేదొర కొడుకు బ్రోచురా? ఎంతో!” – గౌళరాగం, ”సాధించెనే ఓ మనసా! (సమయానికి తగుమాటలాడెనె!)” – ఆరభిరాగం, ”కనకనరుచిరా! కనక వసన నిన్ను….”- వరాళిరాగం, ”ఎందరో మహానుభావులు – అందరికి వందనములు” – శ్రీరాగం కీర్తనలున్నాయి.

అనంతరం రాత్రి 8.15 నుంచి 9.15 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల హరికథా విభాగాధిపతి శ్రీ సింహాచలసాస్త్రి బృందంచే ”శ్రీ త్యాగరాజ యోగ వైభవం” హరికథా పారాయణం చేయనున్నారు. చివరగా మహా మంగళహారతి అనంతరం ప్రసాద వితరణ చేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్ట్‌ల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పుర ప్రజలు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Attachments area