SAKSHATKARA VAIBHAVAM CONCLUDES_ వైభవంగా ముగిసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
Srinivasa Mangapuram, 18 July 2018: The annual Sakshatkara Vaibhavotsavams in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram concluded on a ceremony note on Wednesday.
Earlier during the day, Snapana Thirumanjanam was performed to the deities by priests.
Later in the evening, Lord took celestial ride on Garuda Vahanam.
Tirupati JEO Sri Pola Bhaskar, DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Temple Inspector Sri Anil Kumar and devotees took part.
PARUVETA UTSAVAM ON JULY 19
The annual Paruveta Utsavam will be observed in Srinivasa Mangapuram on Thursday.
TTD has introduced this festival for the first time in 2015. As a part of this, mock hunt festival will be observed in an open area, which is just few kilometers away from the temple here.
All the temple officials will take part in this festival with enthusiasm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వైభవంగా ముగిసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
తిరుపతి, 2018 జూలై 18: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ నిర్వహించారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు.
సాయంత్రం స్వామివారి ఊంజల్‌సేవ కన్నుల పండువగా జరిగింది. ఆ తరువాత లక్షీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా వాహన మండపంలోకి తీసుకొస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఎఈవో శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌కుమార్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జూలై 19న పార్వేట ఉత్సవం :
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 19వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళతారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.