SAKSHATKARA VAIBHAVOTSAVAM AT SRINIVASA MANGAPURAM FROM 7 TO 26TH JUNE _ శ్రీనివాసామంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 7 నుండి 9వ తేది వరకు సాక్షాత్కార వైభవం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీనివాసామంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 7 నుండి 9వ తేది వరకు సాక్షాత్కార వైభవం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
తిరుపతి, జూలై-4, 2008: ఈ సందర్భంగా మూడురోజులలో ఉదయం 9 గం||లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.30 గం||లకు ఊంజల్ సేవలు నిర్వహిస్తారు. స్వామివారు నాలుగు మాడవీధులలో మొదటిరోజు సాయంత్రం 7.30 గం||లకు తిరుచ్చి వాహనంలో, రెండవరోజు సాయంత్రం 8 గం||లకు హనుమంత వాహనంపై, మూడవరోజు సాయంత్రం 8 గం||లకు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు.
ఈ సందర్భంగా ఆలయంలో తి.తి.దే, అన్నమాచార్య ప్రాజెక్ట్, ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.