SALES COUNTERS IN SVITSA TO ENCOURAGE STUDENTS’ SKILLS- TTD CHAIRMAN _ శిల్పకళాశాలలో అమ్మకాల కౌంటర్ ఏర్పాటు చేస్తాం

Tirupati, 15 February 2023: To encourage the different artifacts created by the students of TTD-run Sri Venkateswara Institution of Traditional Sculpture and Architecture(SVITSA) Sales counters will be opened in the institution premises soon said, TTD Chairman Sri YV Subba Reddy. 

 

The TTD Board Chief visited the three-day stall opened in the college premises on the last day on Wednesday. He interestingly took at each artform that was created by the students including stone, metal, wood sculptures, kalamkari paintings etc. 

 

He said to encourage the traditional artforms TTD is taking many initiatives and as a part of it depositing Rs.one lakh on each student on the day of joining and will give them the amount along with interest after the completion of their course”, he said. 

 

The Chairman also said same will be introduced soon even for the students pursuing 2-year Kalamkari course to encourage them to expertise themselves in the field in future, he maintained.

 

He appreciated the efforts of TTD JEO for Health and Education Smt Sada Bhargavi in bringing out the talents and skills among the students by instilling confidence organizing programmes of this nature at regular intervals from the past two years.

 

TTD Board Member Smt Malleswari, Devasthanams Education Officer Sri Bhaskar Reddy, SVITSA Principal Sri Vekat Reddy, faculty, students were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శిల్పకళాశాలలో అమ్మకాల కౌంటర్ ఏర్పాటు చేస్తాం

– విద్యార్థులు తయారు చేసిన శిల్పాలు చాలా బాగున్నాయి
– ప్రదర్శనను సందర్శించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 15 ఫిబ్రవరి 2023 : టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల విగ్రహాలతో పాటు, సాంప్రదాయ, కలంకారి చిత్రాలను విక్రయించడం కోసం కళాశాల ఆవరణంలో కౌంటర్ ఏర్పాటు చేస్తామని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

కళాశాల ఆవరణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిల్పకళా ప్రదర్శనను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కళాశాల విద్యార్థులు తయారుచేసిన శిల్పాలను చూసి వారి నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం కళాశాలలోని వివిధ శిల్పాలను, కలంకారి చిత్రాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, శిల్పకళ ను ప్రోత్సహించడానికి టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ సమయంలో వారి పేరుతో లక్ష రూపాయలు డిపాజిట్ చేసి కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా అందిస్తున్నామని తెలిపారు. ఈ మొత్తం వారి జీవనోపాధికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

కళాశాలలో రెండేళ్ల కలంకారీ కోర్సులో చేరే విద్యార్థులకు కూడా లక్ష రూపాయలు డిపాజిట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నజేఈవో శ్రీమతి సదా భార్గవిని చైర్మన్ అభినందించారు.

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి మల్లీశ్వరి, డిఈవో  శ్రీ భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకట రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది