SAMPOORNA BHAGAVAT GITA SHLOKA PARAYANAM AT TIRUMALA ON DECEMBER 14 _ డిసెంబరు 14న తిరుమలలో భగవద్గీత అఖండ పారాయణం
TIRUMALA, 12 DECEMBER 2021: In connection with Gita Jayanthi on December 14, Sampoorna Bhagavatgita Shloka Parayanam will be organized by TTD at Nada Neerajanam platform in Tirumala.
The Parayanam will be telecasted live on SVBC between 7am and 12noon on December 14.
The Gita Parayanam was commenced by TTD during September 10 last year with scholar, Sri Kuppa Vishwanatha Shastri giving narration while shloka rendition by TTD Vedaparayanamdar Sri Kasipathi.
The Parayanam has been receiving massive response from global devotees ever since its commencement.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 14న తిరుమలలో భగవద్గీత అఖండ పారాయణం
తిరుమల, 2021 డిసెంబరు 12: డిసెంబరు 14న గీతా జయంతిని పురస్కరించుకొని తిరుమల నాదనీరాజనం వేదికపై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు.
మంగళవారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు గంటల పాటు భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంతరాయంగా పారాయణం చేస్తారు. ఈ శ్లోకాలను శ్రీ కాశీపతి పారాయణం చేయగా, శ్రీ కుప్పా విశ్వనాధ శాస్త్రీ వ్యాఖ్యానం చేయనున్నారు.
అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం నిర్వహిస్తున్నారు.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.