SANITIZERS AND MASKS DISTRIBUTED _ టిటిడి ఆసుప‌త్రుల్లో ప‌నిచేసే కార్మికుల‌కు సానిటైజర్లు మరియు మాస్కులు పంపిణీ

Tirumala, 11 Jun. 21: TTD Chairman Sri YV Subba Reddy along with Dr Swetha, Medical Advisor to TTD Medical Wing, distributed Masks and Sanitizers to the frontline workers in Aswini Hospital at Tirumala on Friday.

He lauded the services of TTD doctors, paramedical staff, cleaning staff on this occasion.

Dr Swetha did the contribution towards distributing a Sanitizer and five masks to all the frontline workers rendering their impeccable services in TTD Hospitals.

To start with she donated the material at Aswini Hospital. She said the materials will be provided to the staffs working in SVIMS, BIRRD, Central Hospital and even at Government Ruia   Hospital also.

Aswini Hospital Medical Superintendent Dr Narmada was also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ఆసుప‌త్రుల్లో ప‌నిచేసే కార్మికుల‌కు సానిటైజర్లు మరియు మాస్కులు పంపిణీ

తిరుమల, 11 జూన్ 2021: తిరుమల అశ్విని ఆసుపత్రిలో విధులు నిర్వ‌హించే వైద్య‌, పారిశుద్ధ్య (ఫ్రంట్‌లైన్ ) కార్మికులకు టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డితో పాటు టిటిడి వైద్య విభాగం వైద్య సలహాదారు డాక్టర్ శ్వేతా శుక్రవారం మాస్క్‌లు, శానిటైజర్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మ‌న్ టిటిడి వైద్య సంస్థ‌ల‌లో విశేష సేవ‌లందిస్తున్న‌ వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య‌ సిబ్బందిని అభినందించారు. అనంత‌రం ఫ్రంట్‌లైన్ కార్మికుల‌లో ప్ర‌తి ఒక్క‌రికి  ఒక శానిటైజర్ మరియు ఐదు మాస్కులు పంపిణీ చేశారు.

కాగా డాక్ట‌ర్ శ్వేతా ఈ సానిటైజర్లు, మాస్కులు విరాళంగా అందించారు. త్వ‌ర‌లో తిరుప‌తిలోని టిటిడి సెంట్ర‌ల్ ఆసుప‌త్రి, స్విమ్స్‌, బ‌ర్డ్‌, ప్రభుత్వ రుయా ఆసుప‌త్రుల‌లో ప‌నిచేసే సిబ్బందికి ఈ సామగ్రిని అందిస్తామని ఆమె చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో అశ్విని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూపరింటెండెంట్ డాక్టర్ నర్మదా కూడా పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.