SANKRANTHI FETE AT TTD SCHOOLS _ ఎస్వీ ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Tirupati, 7 Jan. 22: The annual Sankranthi festival has been celebrated in a grand manner at the SV High School and Sri Padmavati Girls High School on Friday.

 

In this connection, the students decorated the school premises with rangoli, flowers etc. to bring a festive look.

 

Smt Sandhya, Headmistress of the school narrated the significance of the festival and highlighted the glory of Indian culture, traditions etc. Thereafter students displayed cultural events.

 

As a part of the festivities, the winners were presented with prizes and certificates.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

 

ఎస్వీ ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

 తిరుపతి, 2022, జనవరి 07: టిటిడికి చెందిన శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పండుగ వాతావరణం కనిపించేలా పాఠశాల పరిసరాలను అలంకరించి రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సంధ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను, భారతీయ సంప్రదాయాలను, సంస్కృతులను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు సంక్రాంతి పండుగను గురించి ఉపన్యసించారు. ఆ తర్వాత విద్యార్థినీ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రంగవల్లుల పోటీల విజేతలకు, సాంస్కృతిక ప్రదర్శన పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.