SARASWATI PUJA AT SV SHILPA KALASALA _ ఎస్వీ శిల్ప కళాశాలలో సరస్వతి పూజ

Tirupati, 14 February 2024: A grand Saraswati Puja was held in celebration of Vasantha Panchami on Wednesday at Sri Venkateswara Sculpture College in Tirupati under the auspices of TTD.

Goddess Saraswati is revered by Hindus as the Mother of education, wisdom who imparts knowledge to the whole world. 

On this occasion, a special pooja was performed to Goddess Sri Gnana Saraswati Devi in ​​the college premises.  Nivedana and Mangalaharati were rendered to the Goddess.

The Principal of the college Sri K. Venkata Reddy, teachers and students participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వీ శిల్ప కళాశాలలో సరస్వతి పూజ

తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 14: టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో గల శ్రీ వెంకటేశ్వర శిల్పకళాశాలలో బుధవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా సరస్వతి పూజ నిర్వహించారు.

సర్వ జగత్తుకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు చదువుల తల్లి సరస్వతీ దేవి. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నివేదన, మహా మంగళహారతి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె.వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.