EO INSPECTS SD COUNTERS AT TIRUPATI_ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 5 May 2018: TTD Executive Officer Sri Anil Kumar Singhal today reiterated that there was no prospects by the Archeological Survey of India to take over any local temples in TTD jurisdiction.

Speaking to reporters after inspection of the Sarva darshan counters set up in temple town the evening the TTD Chief said the Director General of ASI has informed TTD that his office had sent a communication earlier due to some misinformation on the issue.

He said in all 109 SD counters were being set up at Tirupati and Tirumala for benefit of devotees. He directed officials to rake up publicity through flexis and handbills and that Srivari Sevakulu should be deployed with public address systems to spread awareness in different languages about SSD counters.

He also visited the SD counters set up at Railway stations bus stands and advised to officials on how to educate the devotees.

Tirupati JEO Sri Pola Bhaskar, Chief Engineer Sri Chandrasekhar Reddy, SE-1 Sri Ramesh Reddy, ACVSO Sri Shivkumar Reddy, DyEO Smt Kasturi, VSO Sri Ashok Kumar Goud, AVSO Sri Parthasarathy Reddy, EE’s Sri Jaganmohan Reddy, Sri Jagadeeswara Reddy, DE Electrical Sri Ravi Sankar Reddy, EDP OSD Sri Venkateswara Naidu and others participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 మే 5: తిరుపతిలోని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయంలో టిటిడి నూతనంగా ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను శనివారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ పురావస్తు శాఖ పరిధిలోకి టిటిడి ఆలయాలు తీసుకునే అవకాశం లేదని సంబంధిత అధికారులు చెప్పారని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలియజేశారు. భారత పురావస్తు శాఖవారు సమాచారలోపం కారణంగా టిటిడికి లేఖ పంపినట్లు ఆర్కియాలజీ సర్వే ఆప్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ తెలియచేశారని, వారు ఇచ్చిన నోటిసులను రద్దు చేసినట్లు తెలిపారని ఈవో వివరించారు.

కాగా భక్తులకు నిర్ణ్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుపతి, తిరుమలలో 109 సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కౌంటర్ల గురించి భక్తులకు తెలిసేలా రైల్వే స్టేషన్‌, బస్టాండు, భక్తుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా శ్రీవారి సేవకులతో మైక్రో మైక్‌ల ద్వారా వివిధ భాషలలో భక్తులకు అర్థమయ్యేలా ప్రకటనలు ఇవ్వాలని కోరారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం వివరాలను భక్తులు సులభంగా గుర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం ఆయన అధికారులతో కలిసి తిరుపతి రైల్వే స్టేషన్‌, ఆర్టీసి బస్టాండ్‌లలో ఉన్న కౌంటర్లలో టోకెన్ల జారీ, భక్తులకు ఎదురయ్యే సమస్యలను పరిశీలించి తగు సూచనలు చేశారు. భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలలో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. ఈ విధానాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈవో, జెఈవో వెంట సీఈ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఈ-1 శ్రీ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌గౌడ్‌, ఎవిఎస్‌వో శ్రీ పార్థసారధిరెడ్డి, డిఈ ఎలక్ట్రికల్‌ శ్రీ రవిశంకర్‌ రెడ్డి, ఈడిపి ఓఎస్‌డి శ్రీ వేంకటేశ్వరనాయుడు, ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.