SARVA SWATANTRA VEERALAKSHMI CHARMS ON SIMHA VAHANAMS _ సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో సిరులతల్లి
సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో సిరులతల్లి
తిరుపతి, 2020 నవంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీరత్వం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
వాహనసేవలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బా రెడ్డి, ఈవో డాక్టర్ కె.యస్.జవహర్ రెడ్డి. బోర్డు సభ్యులు డా.చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీమతి ప్రశాంతి రెడ్డి, డా.నిచ్చిత, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శనివారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు హనుమంతవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tiruchanoor, 13 Nov. 20: On the third day evening as part of ongoing Navahnika Brahmotsavams at Tiruchanoor, Goddess Sri Padmavathi Devi decked as Sarva Swatantra Veera Lakshmi charmed on Simha Vahanam.
In view of Covid restrictions, the annual fete is being observed in Ekantam.
MoS for Home Affairs Sri G Kishen Reddy, TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Board members Dr C Bhaskar Reddy, Smt Prasanthi Reddy, Dr Nischita, JEO Sri P. Basath Kumar, CVSO Sri Gopinath Jatti, SP Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI