SARVABHUPALA SHOWCASES HIS POWER_ స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయ‌మ‌ర్ద‌నుడి అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

Srinivasa Mangapuram, 27 February 2019: The Universal Supreme Commander, Sarvabhupala, showcased His mightiness and power by taking a majestic ride on the finely decked Sarvabhupala Vahanam.

The Lord of Lords, blessed His devotees on the pleasant evening on Wednesday on the Sarvabhupala along with His two consorts Sridevi and Bhudevi.

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయ‌మ‌ర్ద‌నుడి అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 27: శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి కాళీయ‌మ‌ర్ద‌నుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

నాలుగవ నాటి రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.

ఈ కార్యక్రమంలో చంద్ర‌గిరి ఎమ్‌.ఎల్‌.ఏ. శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.