SCORES WITNESS POURNAMI GARUDA SEVA_ తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Tirumala, 6 September 2017: Tens of thousands of pilgrims thronged the hill town to witness pournami Garuda Seva on wednesday evening.

Braving the heavy down pour pilgrims occupied all the galleries in the mada streets to take a glimpse of Lord Malayappa on Garuda Vahanam.

The procession was a colourful affair with the bhajan troupes performing various art forms in front of procession. While the TTD security with the help of police, srivariseva volunteers and scouts made security arrangements.

Tirumala premises reverberated to the rhythmic chant of Govinda Namas by devotees.

Tirumala Pedda Jiyangar swamy, Chinna Jiyangar Swamy, Tridandi Chinna Jiyar Swamy, Tirumala JEO Sri KS Sreenivasa Raju and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల, 06 సెప్టెంబరు 2017: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో బుధవారంనాడు పౌర్ణమి రోజున తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను రాత్రి 7 నుండి 9 గంటల నడుమ టిటిడి ఘనంగా నిర్వహించింది. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలోనే మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.

శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఉత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయార్‌ స్వామి, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.