సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులు

సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులు

తిరుమల, 2017 సెప్టెంబరు 13: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి రోజూ సాయంత్రం నిర్వహించే సహస్రదీపాలంకరణసేవ మండపం ( ఎస్‌డి మండపం) సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు మరమ్మత్తులు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి శ్రీవారి సహస్రదీపాలంకరణసేవను వారం రోజుల పాటు వైభవోత్సవ మండపంలో నిర్వహించనున్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.