SECOND PHASE COUNSELLING IN TTD COLLEGES ON JUNE 28_ టిటిడి జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు జూన్‌ 28 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌

Tirupati, 27 June 2017:Second round counselling for admission into TTD run colleges will be held on June 28.

According to Devasthanams Educational Officer Smt Snehalatha, for admissions into TTD junior and degree colleges the counselling will be held on Wednesday in Sri Govindaraja Swamy Arts College.

The students who are attending for the counselling should bring their originals with two sets of photocopies, two passport size photos, income, caste certificates, ration and adhaar card xerox copies with defined fees amount. For further information.

please visit TTD official website, www.tirumala.org or admission.tirumala.org

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు జూన్‌ 28 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌

తిరుపతి, 2017, జూన్‌ 27: టిటిడి ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాలలో జూన్‌ 28 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ జరుగనుందని టిటిడి విద్యాశాఖాధికారి శ్రీమతి ఆర్‌.స్నేహలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జూన్‌ 28న జూనియర్‌ కళాశాలలకు…

శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి గాను జూన్‌ 28న అన్ని కేటగిరీల విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఓసిలకు 8.5 నుంచి 8.0 జిపిఎ, బిసిలకు 8.5 నుంచి 8.0 జిపిఎ, ఎస్‌సిలకు 8.5 నుంచి 7.8 జిపిఎ, ఎస్‌టిలకు 8.3 నుంచి 7.5 జిపిఎ పాయింట్లు ఉన్నవారు హాజరుకావాల్సి ఉంటుంది.

శ్రీ వేంకటేశ్వర జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి జూన్‌ 28న అన్ని కేటగిరీల విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఓసిలకు 8.2 నుంచి 7.7 జిపిఎ, బిసిలకు 8.2 నుంచి 7.7 జిపిఎ, ఎస్‌సిలకు 8.2 నుంచి 7.7 జిపిఎ, ఎస్‌టిలకు 8.2 నుంచి 7.5 జిపిఎ పాయింట్లు ఉన్నవారు హాజరుకావాల్సి ఉంటుంది.

జూన్‌ 29న, జూలై 1న డిగ్రీ కళాశాలలకు…

టిటిడిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాల, శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలల్లో ప్రవేశానికి జూన్‌ 29, జూలై 1వ తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

జూన్‌ 29న మ్యాథ్స్‌ కాంబినేషన్‌ కోర్సులకు ఓసిలు 800, ఆపైన మార్కులు వచ్చినవారు, బిసిలు 750, ఆపైన మార్కులు వచ్చిన వారు, ఎస్‌సిలు 700, ఆపైన మార్కులు వచ్చినవారు, ఎస్‌టి విద్యార్థులు 600, ఆపైన మార్కులు వచ్చిన వారు హాజరు కావాల్సి ఉంటుంది.

జూలై 1న బయలాజికల్‌ సైన్స్‌ కోర్సులకు ఓసిలు 800, ఆపైన మార్కులు వచ్చినవారు, బిసిలు 750, ఆపైన మార్కులు వచ్చిన వారు, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు 600, ఆపైన మార్కులు వచ్చిన వారు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదే రోజున కామర్స్‌, ఆర్ట్స్‌ కాంబినేషన్‌ కోర్సులకు ఓసిలు 750, ఆపైన మార్కులు వచ్చినవారు, బిసిలు 700, ఆపైన మార్కులు వచ్చినవారు, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు 600, ఆపైన మార్కులు వచ్చినవారు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతోపాటు రెండు సెట్ల జెరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు, ఆధార్‌, రేషన్‌కార్డుల జెరాక్స్‌లు తీసుకురావాల్సి ఉంటుంది. హాస్టల్‌ సీట్లను ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు. విద్యార్థులు ప్రవేశాలకు తగిన ఫీజుతో రావాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు news.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.