SEETAMPETA TEMPLE MAHA SAMPROKSHANAM _ ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు సీతంపేటలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ 

ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు సీతంపేటలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

– ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

సీతంపేట, 10 ఏప్రిల్ 2023: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో డాక్టర్ నవ్య, టీటీడీ అధికారులతో కలసి సోమవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ టీటీడీ స్వామివారి ఆలయాలు నిర్మిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా గిరిజన ప్రాంతమైన సీతంపేటలో శ్రీవారి ఆలయాన్ని చక్కగా నిర్మించినట్లు చెప్పారు. మే 4వ తేదీ నుంచి ఇక్కడ భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తామన్నారు. ఆలయ సమీపంలోని కల్యాణ మండపాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలని, కల్యాణ మండపాన్ని స్థానిక గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమానికి వచ్చే అర్చకులు,ఇతర అధికారులు,సిబ్బంది, శ్రీవారి సేవకుల వసతి కోసం ఐటి డి ఎ అతిథి గృహం, పాఠశాలలు పరిశీలించారు. ఆతరువాత మన్యం జిల్లా రాజాం లోని శ్రీవారి ఆలయాన్ని జేఈవో ఇతర అధికారులు సందర్శించారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శ్రీగుణభూషణ్ రెడ్డి, ఎస్ ఈ (విద్యుత్ )శ్రీ వెంకటేశ్వర్లు , విజివో శ్రీమనోహర్, గిరిజన కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ శ్రీమతి సంధ్యా రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, 10 APRIL 2023: The Maha Samprokshanam fete in Srivari temple at Seetampeta of Parvatipuram Manyam district will be observed between April 29 to May 4, said TTD JEO Sri Veerabrahmam.

On Monday, he inspected the temple along with ITDA PO Dr Navya and other TTD officials.

He said the festivities begin on April 29 and from May 4 onwards devotees will be provided darshan of Sri Venkateswara after Maha Samprokshanam rituals.

The ITDA PO Dr Navya expressed the construction of Sri Venkateswara temple in an agency area like Seetampeta and thanked TTD for enabling the denizens to have the blessings of Srivaru.

The JEO earlier inspected the accommodation at ITDA rest house, schools etc. to be arranged for Srivari Sevaks who will be invited to offer services during these days.

CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, DyEO Sri Gunabhushan Reddy, VGO Sri Manohar, Girijana Corporation Divisional Manager Smt Sandhya Rani and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI