SENIOR CITIZENS AND PHYSICALLY CHALLENGED PERSONS DARSHAN ON NOVEMBER 14 AND 21_ నవంబరు 14, 21వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, నవంబరు 15, 22వ తేదీల్లో 5 ఏళ్లలోపు పిల్లలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 11 November 2017: To provide darshan of Lord Venkateswara to more number of senior citizens (above 65years) and specially abled persons, TTD will issue four thousand tickets to the pilgrims falling under this category on November 14 and 21.

The tickets will be issued in three slots with 1000 tickets during 10am, 2000 tickets at 2pm and another 1000 tickets by 3pm on these two days.

TTD has introduced this system in August this year and darshan will be given to this category pilgrims on any two lean days in a month.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 14, 21వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, నవంబరు 15, 22వ తేదీల్లో 5 ఏళ్లలోపు పిల్లలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల, 2017 నవంబరు 11: తిరుమలలో ఎక్కువ మంది వృద్ధులకు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారిదర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా నవంబరు 14, 15వ తేదీలలో వృద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, మధ్యాహ్నం 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి కలిపి మొత్తం 4 వేల టోకెన్లు జారీ చేస్తారు.

5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను నవంబరు 15, 22వ తేదీలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.