SERVE DEVOTEES WITH MENTAL AND PHYSICAL FITNESS – TTD PRO _ శరీరక ధృడత్వంతో పాటు మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలి : టిటిడి పిఆర్వో డా|| టి.ర‌వి

TTD EMPLOYEES ANNUAL SPORTS MEET – 2020 INAUGRATED

Tirupati   02 Feb 20 ; Sports are basic ingredients for preparing mental and physical fitness and much needed for TTD employees to serve the devotees in a much more better way, says TTD PRO Dr T Ravi.

Kick starting the TTD employees annual sports meet-2020 at the parade grounds behind TTD Administrative Building in Tirupati on Sunday, Dr Ravi  said the annual event is being conducted regularly ever since 1977.

He said the TTD employees function under great stress while dealing with  lakhs of devotees who throng the hill shrine of Tirumala every day.

During key festival like  Vaikuntha Ekadasi, Brahmotsavams, Ratha Sapthami they coordinate with Srivari Sevakulu and scouts and guides to render huge services to the multitude of  pilgrims. 

The sports will help to overcome mental stress and ensures physical fitness and keep the TTD employees stay fit and steady to face any challenges, he said.

He urged the employees to consider their functionality in TTD not as an employment but as a divine opportunity to serve society through devotees.

DyEO Smt Snehalata of the TTDs welfare section highlighted the scope of sports events for both men and women below 40 years, 41-50years, 50 and above years, retired and also physically challenged staffers.

Earlier, Dr Ravi hoisted the national Flag, TTD spots meet flag and peace flags. Employees of several departments also staged a parade which was followed by a Pledge. 

EEs KSubramanyam,  Sri Mallikarjuna Prasad, Catering officer Sri Sai Baba Reddy, AVSO Sri Narayana and other officials and employees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శరీరక ధృడత్వంతో పాటు మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలి  : టిటిడి పిఆర్వో  డా|| టి.ర‌వి

ఘనంగా టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు-2020 ప్రారంభం

తిరుపతి, 2020 ఫిబ్రవరి 02: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు శారీరక ధృడత్వంలోపాటు, మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు క్రీడలు అవసరమని టిటిడి ప్రజాసంబంధాల అధికారి  డా|| టి.ర‌వి అన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వైనక వైపు గల పరేడ్‌ మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు -2020 ఆదివారం ఉద‌యం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిఆర్వో ప్రసంగిస్తూ టిటిడిలో 1977 నుండి ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు విచ్చేసే వేలాది మంది భక్తులకు విశేష సేలందిస్తున్న ఉద్యోగులు తీవ్ర వత్తిడితో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వైకుంఠ ఏకాద‌శి, ర‌థ‌స‌ప్త‌మి వంటి ప‌ర్వ‌దినాల‌లో ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి సేవ‌కులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ఉద్యోగులు విశేష సేవ‌లందిస్తున్నార‌ని తెలిపారు. ఈ వత్తిడిని అదిగమించడానికి, శారీరక ఆరోగ్యనికి  క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. టిటిడిలో పనిచేయడం ఉద్యోగంగా భావించకూడదని, అది సేవాభాగ్యమన్నారు.  క్రీడల ద్వారా మనలోని క్రొత్త కోణాలు వెలికి తీసుకురవచ్చన్నారు

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత మాట్లాడుతూ పురుషులు, స్త్రీల విభాగంలో 40 సం||రాల లోపువారికి, 41 నుంచి 50 సం||లోపువారికి, 50 సం||రాల పైబడిన వారికి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, దివ్యాంగ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. క్రీడాపోటీల్లో మొదటిస్థానం పొందినవారికి రూ.2000/-, రెండో స్థానం పొందినవారికి రూ.1800/-, మూడో స్థానం పొందినవారికి రూ.1600/- విలువగల గిఫ్ట్‌వోచర్‌లు బహుమతులుగా అందిస్తామన్నారు. పురుషుల విభాగంలో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, లాన్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, కబడ్డీ, మహిళల విభాగంలో టగ్‌ ఆఫ్‌ వార్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, త్రోబాల్‌, డాడ్జిబాల్‌, కబడ్డీ పోటీలు ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ వ‌ర‌కు నిర్వహిస్తామని తెలిపారు.

ముందుగా జాతీయ జెండాను, క్రీడోత్సవాల జెండాను పిఆర్వో ఆవిష్కరించి శాంతికపోతాలను, ఎగురవేశారు. అంత‌కుముందు పలు విభాగాల ఉద్యోగులు కవాతు నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రార్థన చేశారు.

ఈ కార్యక్రమంలో ఇఇలు శ్రీ సుబ్రుమ‌ణ్యం, శ్రీ మ‌ల్లిఖార్జున ప్ర‌సాద్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ సాయిబాబారెడ్డి, ఎవిఎస్వో శ్రీ నారాయ‌ణ‌, ఇతర ఆధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.