SERVE MORE TASTIER AND HYGIENIC FOOD TO DEVOTEES-TTD EO _ భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందించాలి : టిటిడి ఈవో డా|| కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి

TIRUMALA, 04 AUGUST 2021: The devotees who are coming for darshan of Sri Venkateswara Swamy from across the world should be served with more tastier and hygienic food, said TTD EO Dr KS Jawahar Reddy.

Reviewing with Annaprasadam officials along with Additional EO Sri AV Dharma Reddy on Annaprasadam Trust activities at Annamaiah Bhavan in Tirumala, the EO directed the officials concerned to prepare a different menu on each day of the week for devotees.

During the meeting the EO said, as we are now receiving almost 14 varieties of vegetables in the form of donations from various vegetable donors, we can plan a different menu on each day and serve it to pilgrims. Negotiate with the donors and ensure that different menus are served to pilgrims on each day in a tastier and hygienic way, the EO maintained.

He also instructed to chalk out plans to increase the number of donors contributing for a day breakfast or a meal by enhancing publicity on the same which was introduced by TTD in Annaprasadam Trust a couple of years ago.

The EO directed the officials concerned to negotiate with hoteliers with a philanthropic blend of mind to set up hotels for serving snacks and beverages at all the Rest Houses in Tirumala on a cost to cost basis.

Later the EO also reviewed various darshan entry points including Supatham, Rs.300 tickets, Arjitha Seva tickets etc.

CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, GM Sri Sesha Reddy, DyEOs Sri Ramesh Babu, Sri Harindranath, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందించాలి : టిటిడి ఈవో డా|| కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి

తిరుమ‌ల‌, 2021 ఆగ‌స్టు 04: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి ఈవో డా|| కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భవనంలో బుధ‌వారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ 14 ర‌కాల కూర‌గాయ‌లతో వారంలో ఒక్కొ రోజు ఒక్కొ ర‌క‌మైన రుచుల‌తో భ‌క్తుల‌కు అన్నప్ర‌సాదం అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం వివిద ప్రాంతాల నుండి కూర‌గాయ‌ల అందించే దాత‌ల‌తో సంప్ర‌దించాల‌ని సూచించారు. అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించే భ‌క్తుల సంఖ్య‌కు త‌గ్గ‌ట్టు త‌యారీ, పంపిణీ చేసేందుకు అవ‌స‌ర‌మైన సిబ్బందిపై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని అన్న‌ప్ర‌సాదం అధికారుల‌ను ఆదేశించారు.  

తిరుమలలో ఒక రోజు అన్నప్రసాదాలు, అల్పాహారం అందించే దాత‌ల సంఖ్య పెంచేందుకు విస్తృతంగా ప్ర‌చారం క‌ల్పించాల‌న్నారు. సేవా ధృక్ప‌దం క‌లిగిన పెద్ద హోట‌ల్స్ యాజ‌మాన్యంతో సంప్ర‌దించి తిరుమ‌ల‌లోని అతిథి గృహ‌ల వ‌ద్ద కాస్ట్ టు కాస్ట్‌తో కాఫీ, స్నాక్స్ అందించేందుకు గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌న్నారు.

అనంత‌రం శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనికి ప్ర‌వేశించే సుప‌థం, ఆర్జిత సేవ టికెట్లు, రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ దర్శ‌నం టికెట్లు క‌లిగిన భ‌క్తుల ప్ర‌వేశ మార్గాల‌పై ఈవో స‌మీక్షించారు.  

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ట్రాన్స్‌పోర్టు జియం శ్రీ శేషారెడ్డి, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి  స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.