SERVICES OF VAHANAM BEARERS ARE IMPECCABLE-TTD CHAIRMAN _ సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం :టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
Tirumala, 8 Oct. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Tuesday lauded the outstanding services of Vahanam bearers during the nine day Brahmotsava Vahana Seva.
Pouring in praises on the services of Vahanam bearers at Vahana Mandapam in Tirumala, the Board Chief said, the efforts of all departments on one hand and that of Vahanam bearers on another hand in making the brahmotsavams a grand success.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
అక్టోబరు 08, తిరుమల, 2019: టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ..శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. వాహనబేరర్లు ఎంతో భక్తిభావంతో వాహనాలను మోశారని అభినందించారు. టిటిడి ఈవో, అదనపు ఈవో, తిరుపతి జెఈవో, సివిఎస్వోతోపాటు ఉన్నతాధికారులు విశేష సేవలందించారని కొనియాడారు. బ్రహ్మోత్సవ వైభవాన్ని వ్యాప్తి చేసిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.