SESHACHALAPATHY TAKES RIDE ON SESHA VAHANAM_ ఆదిశేషునిపై విహరించిన శేషాచలపతి

Tirumala, 23 October 2017: The processional deity of Lord Malayappa Swamy along with His two Consorts, Sridevi and Bhudevi took celestial ride on Pedda Sesha Vahanam on Monday evening in connection with the auspicious Nagula Chaviti.

Usually after the Deepavali Amavasya, the Nagula Chaviti festival occurs on Chaviti in the month of Kartika. Some will also observe Nagula Chaviti in Sravana Masam. During these occasions, the Lord will take a pleasure ride on the seven hooded Pedda Sesha Vahanam, which is believed as the serpent king Adisesha.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Ake Ravikrishna, VGO Sri Raveendra Reddy, Temple DyEO Sri Rama Rao and other officals took part in this fete.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

ఆదిశేషునిపై విహరించిన శేషాచలపతి

అక్టోబరు 23, తిరుమల 2017: పవిత్ర నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మలయప్పస్వామి తన ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కూడి ఏడు పడగల పెద్దశేషవాహనంపై సోమవారం సాయంత్రం తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందుచేశాడు.

కాగా దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీశుద్ధ చతుర్థిని నాగులచవితిగా వ్యవహరిస్తారు. శ్రావణ శుద్ధ చతుర్దినాడు కూడా ఈ పండుగను జరుపుకుంటారు.

పురాణ ప్రాశస్త్యం మేరకు సర్పరాజైన ఆదిశేషువు జగన్నాధునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా , పాదుకలుగా, శయ్యలాగా, ఛత్రంగా, కామరూపియై వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా స్వామివారికి సేవలందిస్తాడు. అంతే కాకుండా రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు సేవకులలో ఆద్యుడు.

ఈ విధంగా స్వామివారు దాస భక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషువుపై ఉభయ దేవేరులతో కూడి భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగత ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపజేస్తున్నారు. అందుకే బ్రహ్మూెత్సవ వాహనసేవలలో తొలి ప్రాధాన్యత కూడా ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.

కాగా నాగుల చవతి పర్వదినంనాడు రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల నుండి నడుమ తిరుమాడ వీధులలో పెద్ద శేషవాహనంపై స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో తి.తి.దే ఆలయ ఆధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.