SEVAKS AND SCOUTS DARE HEAVY DOWNPOUR TO SERVE PILGRIMS ON V-DAYS _ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీవారి సేవకులు, స్కౌట్స్ విశేష సేవలు
Tirumala, 7 January 2020: Incessant heavy downpour has not hampered the serving spirit of srivari seva volunteers and scouts, who braved the rains and continued the services to the multitude of pilgrims on Vaikuntha Ekadasi and Dwadasi days in Tirumala.
The Hill town witnessed heavy influx of pilgrims who thronged for vaikunthadwara darsanam on January 6 and 7.
About 3500 srivari sevakulu and 1300scouts and guides have rendered impeccable services to pilgrims in the last three days from January 5 to 7.
The pilgrims complimented the services of these volunteers who distributed food, water at regular intervals to the pilgrims waiting in compartments, queue lines, sheds and mada streets.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీవారి సేవకులు, స్కౌట్స్ విశేష సేవలు
తిరుమల, 07 జనవరి 2020: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అశేషంగా విచ్చేసిన భక్తజన వాహినికి శ్రీవారి సేవకులు, స్కౌట్లు విశేషంగా సేవలందించారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా భక్తులకు సేవలు అందించి సేవాస్ఫూర్తిని చాటారు.
వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన 3500 మంది శ్రీవారి సేవకులు, 1300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ కలిసి జనవరి 5 నుండి 7వ తేదీ వరకు భక్తులకు మెరుగైన సేవలు అందజేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలో, మాడవీధుల్లోని షెడ్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ పాలు, అల్పాహారం పంపిణీ చేయడం పై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.