ENHANCE OPHTHALMIC SERVICE BY SRI SRINIVAS SHANKARA NETHRALAYA- EO SINGHAL_ శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టు ద్వారా మెరుగైన నేత్రవైద్యసేవలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 1 November 2017: TTD Executive Officer Sri Anil Kumar Singhal today said that the Sri Srinivas Shankara Nethralaya should be strengthened to provide better and more services to the eye affected devotees.
Reviewing the functioning of the Sri Srinivas Shankara Nethralaya at the TTD admin building here Sri Singhal said the ophthalmic unit jointly run with TTD support should provide specialized eye care and also specs to affected devotees.
The Eye care trust should purchased all sophisticated equipment including the MESU (mobile eye surgical unit) and should conduct eye training camps at Hindupur and serve the poor soon. A special camp should be organised for benefit of all students of the TTD educational institutions by December, he said.
Among others Tirumala JEO Sri K S Sreenivasaraju, Tirupati JEO Sri Pola Bhaskar, Sri Srinivas Shankara Nethralaya MD Dr KS Vasan, DGM Sri Suresh, Advisor Sri NJD Ranganathan, Sri Srinivas Shankara Nethralaya in-charge Dr P Devika and Administration Officer Sri R Srinivas participated in the review meeting.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టు ద్వారా మెరుగైన నేత్రవైద్యసేవలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
నవంబరు 01, తిరుపతి, 2017: శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టు ద్వారా ఎక్కువ మంది రోగులకు మెరుగైన నేత్రవైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో బుధవారం శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అనేకమంది నేత్రవైద్యం కోసం తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శంకరనేత్రాలయ ఆసుపత్రికి వస్తున్నారని, వీరికి అవసరమైన పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స, పరికరాలు అందించాలని సూచించారు. ట్రస్టు నిధుల నుంచి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్(ఎంఇఎస్‌యు) కొనుగోలు చేయాలని, ఈ వాహనం ద్వారా వివిధ ప్రాంతాల్లో నేత్రవైద్యశిబిరాలు, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. త్వరలో అనంతపురం జిల్లా హిందూపురంలో నేత్ర వైద్యశిబిరం నిర్వహించి ఎక్కువ మందికి వైద్యసేవలు అందించాలని సూచించారు. టిటిడి కళాశాలల విద్యార్థుల కోసం డిసెంబరులో మెగా నేత్ర వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి,, సిఏవో శ్రీ రవిప్రసాదు, సిఎంవో డా|| నాగేశ్వరరావు, ఎస్‌ఎంవో డా|| మురళి, శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ఎండి డా|| కెఎస్.వాసన్, డిజిఎం శ్రీసురేష్, సలహాదారు శ్రీ ఎన్‌డిజె.రంగనాథన్, శంకర నేత్రాలయ తిరుపతి ఇన్‌చార్జి డా|| పి.దేవిక, అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీ ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.