SHANKARA JAYANTI OBSERVED IN SV VEDIC VARSITY _ శాస్త్రోక్తంగా శంకర జయంతి పూజ
Tirupati, 17 May 2021: On the auspicious occasion of the Birth Anniversary of Jagadguru Sri Shankaracharya, special puja was performed in Yagashala of Sri Venkateswara Vedic Varsity premises in Tirupati on Monday.
The fete commenced with the introductory remarks by Vedic exponent Sri Prava Ramakrishna who said Sri Shankaracharya dedicated his entire life in the promotion and preservation of Hindu Sanatana Dharma and preached Advaitha philosophy to the world of Bhakti.
Later the ritual started with Sankalpam, Ganapati Puja by Vedic scholars Sri GV Subramanya Sharma and Dr GV Phaniraja Shastry under the supervision of SV VU Vice-Chancellor Sri Sannidhanam Sudarshana Sharma.
Sri Shankaracharya Puja performed which included Astottara Shatanamavali, Padukabhishekam etc. amidst chanting of Chaturveda Parayanam by Veda pundits.
The entire spiritual event was live telecasted by Sri Venkateswara Bhakti Channel of TTD for the sake of global devotees between 11am and 12noon.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శాస్త్రోక్తంగా శంకర జయంతి పూజ
తిరుపతి, 2021 మే 17: లోక కల్యాణార్థం వైశాఖ మాసంలో టిటిడి తలపెట్టిన పూజ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం శంకర జయంతినాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం శ్రీ మహావిష్ణువు యాగశాలలో శంకర పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 11నుండి 12 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా వర్సిటీ ఆచార్యులు శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు సనాతన హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యుల్లో ప్రథములన్నారు. సాక్షాత్తు పరమశివుని అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ శంకరుడు అధ్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి విశ్వ వ్యాప్తి చేశారని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణకు శ్రీ శంకరాచార్యులు చేసిన కృషిని, శంకర జయంతి ఉత్సవ విశేషాలను వివరించారు.
ముందుగా సంకల్పంతో ప్రారంభించి గణపతి పూజ చేశారు. అనంతరం ఆదిశంకరాచార్యులు శిష్యబృందంతో ఉన్న చిత్రపటానికి బిల్వాలు, పుష్పాలతో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజ నిర్వహించారు. ఆ తరువాత మహామంగళహారతి, క్షమాప్రార్థనతో పూజ ముగిసింది.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ జి.వి.సుబ్రమణ్య శాస్త్రి, శ్రీ జి.వి.ఫణిరాజశాస్త్రి శంకర పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.