SHOBHA YATRA CONDUCTED _ గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలి : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

TIRUMALA TIRUPATI DEVASTHANAMS    

SHOBHA YATRA CONDUCTED 

Tirupati, 5 Nov. 19: The three day Traimasika Metlotsavam commenced with Shobha Yatra on Tuesday evening at Tirupati. 

The Yatra started from Sri Govindaraja Swamy temple to Third New Chowltry. 

Speaking on this occasion the JEO said, the Bhajana Mandalis should be strengthened from grass root level. He appreciated the devotion of Dasa Sahitya Bhajana Mandali members. 

Special Grade DyEO Smt Varalakshmi,  Dasa Sahitya Project Special Officer Sri PR Ananda Theerthacharyulu were also present.

HARINAMA SMARANA IS EASY WAY FOR SALVATION -SEER

The Pontiff of Sri Kukke Subramanya Mutt, HH Sri Vidyaprasanna Theertha Swamy advocated that Harinama Sankeertana is the path to salvation.

During his religious discourse held at Third Chowltry in Tirupati as a part of Traimasika Metlotsavam on Tuesday evening, he said,  Tirumala is being trekked by many sacred souls and this is ideal for conducting Metlotsavam during every three months.

Dasa Sahitya Project Special Officer Sri PR Anandatheerthacharyulu, 3000 Dasaparas were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

 

గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలి   : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 న‌వంబ‌రు 05: దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గల భజన మండళ్ల సభ్యులు ప్రజలలో భక్తి భావాని పెంపొందించేందుకు గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలని టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పిలుపునిచ్చారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి 3వ సత్రం ప్రాంగణంలో ప్రాంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమంలో టిటిడి జెఈవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ దాససాహిత్య ప్రాజెక్టులోని భజన మండళ్ల సభ్యులు క్రమశిక్షణ, నైపుణ్యం కలిగి వున్నట్లు తెలిపారు. భజన మండళ్ల సభ్యులు తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసి, మంచి నడవడిక అలవర్చాలన్నారు.  సనాతన హైందవ ధర్మం ప్రచారం చేయవలసిన బాధ్యత టిటిడిపై వుందన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు బలోపేతానికి, మెట్లోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు టిటిడి తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు.

ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.

వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

 కాగా, సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 100 బృందాల్లో 2,000 మంది భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్‌ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుంది. న‌వంబ‌రు 7వ తేదీ గురువారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు, ఏఈవో శ్రీ ర‌విప్ర‌కాష్‌రెడ్డి, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు పాల్గొన్నారు.

కలియుగంలో హరినామస్మరణే మోక్షానికి మార్గం : శ్రీశ్రీశ్రీ  విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ
 
కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని క‌ర్ణాట‌క‌లోని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం  తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్రం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుండి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో మెట్లోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా భగవన్నామస్మరణ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. కొక్కె సుబ్రహ్మణ్య క్షేత్రంలో సాక్షాత్తు ఆదిశేషుడే కొలువయ్యారని, ఇక్కడ స్వామివారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయన్నారు.
 
టిటిడి ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలోక్ర‌మం త‌ప్ప‌కుండా మెట్లోత్స‌వం నిర్వ‌హిస్తోందన్నారు. ఎందరో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీవ్యాసరాజయతీశ్వరులు శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారని చెప్పారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతున్నట్టు వివరించారు. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల‌ నుండి 2 వేల‌ మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొనడం సంతోషకరమన్నారు.
 
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.